Thursday, May 2, 2024

ఈసారి టెన్త్‌, ఇంటర్ ఫలితాలు ఎట్లుంటాయో! రిజల్ట్స్ పై అధికారుల్లో ఆందోళ‌న‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలపై అటు విద్యాశాఖ, ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది. ఫలితాలు ఎలా ఉండబోతాయోనని తర్జనభర్జన అవుతున్నారు. టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలను ఈ నెలలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం పదో తరగతి, ఇంటర్‌ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం చివరి దశకు వచ్చింది. రేపటితో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికానుండగా, ఈనెల 12న ఇంటర్‌ మూల్యాంకనం పూర్తి కానుంది. ఆ తర్వాత ప్రక్రియను పూర్తి చేసి ఈనెల చివరికల్లా ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలపై విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పెద్దలు పూర్తి స్థాయిలో దృష్టిసారించినట్లు సమాచారం. ఫలితాలు ఎలా ఉండబోతాయోననే అంశంపై ఆరా తీసినట్లుగా విద్యా వర్గాల్లో చర్చ నడుస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనంలో సాధరణంగానే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ ఈసారి మూల్యాంకనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏ ఒక్క విద్యార్థి నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విధుల్లో ఉండే సిబ్బందికి పై అధికారులు సూచనలు చేసినట్లుగా సమాచారం. ఈక్రమంలోనే మూల్యాంకనం ప్రక్రియ, ఫలితాల వెల్లడిలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చలేదు. వాటిని రద్దు చేసి విద్యార్థులకు ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా అందరికీ గ్రేడింగ్‌ ఇచ్చారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల తర్వాత పరీక్షలను మే నెలలో విజయవంతంగా నిర్వహించారు. కరోనా కారణంగా గత రెండేళ్లు వందకు వంద శాతం ఫలితాలు వచ్చాయి. ఈ విద్యా సంవత్సరంలో కొన్ని రోజుల వరకు పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులనే నిర్వహించడం జరిగింది. అలాగే విద్యా సంవత్సరం కూడా కాస్త ఆలస్యంగానే ప్రారంభమయ్యింది. ఇలాంటి పరిస్థితుల నడుమ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. పైగా ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు గత 8, 9వ తరగతుల్లో వార్షిక పరీక్షలు రాసిన అనుభవం వారికి లేకుండా పోయింది. ఈక్రమంలో పదో తరతతి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆందోళన విద్యా వర్గాల్లో నెలకొంది.

గతేడాది ఫస్ట్‌ ఇయర్‌లో 49 శాతం ఉత్తీర్ణత…

గతేడాది డిసెంబర్‌లో వెల్లడించిన ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల ఉత్తీర్ణత బాగా తగ్గిపోయింది. జనరల్‌, ఒకేషనల్‌ కలిపి 49 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 2020లో ఉత్తీర్ణత శాతం 60.01 శాతం కాగా 2021లో 11 శాతం తగ్గింది. గతంలో ఎప్పుడూ లేనంగా ఉత్తీర్ణత శాతం పడిపోవడానికి పరీక్షలపై అస్పష్టత, కరోనా ప్రభావం పధాన కారణం. 2022-21 విద్యా సంవత్సరంలో నెలన్నర తప్ప మిగిలిన రోజుల్లో ఆన్‌లైన్‌ తరగతులే జరిగాయి. ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు మే నెలలో పరీక్షలు జరగాల్సి ఉండగా కరోనా రెండో వేవ్‌ కారణంగా విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్‌ చేశారు. భవిష్యత్‌ పరిస్థితులను బట్టి వీరికి ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు నిర్వహిస్తామని పెర్కొంది. అన్నట్లుగానే ఆ విద్యార్థులకు అక్టోబర్‌లో ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు నిర్వహించారు. అప్పటికే ద్వితీయ సంవత్సరం చదువులో నిమగ్నమైన విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితంగా 51 శాతం మంది ఫెయిల్‌ అవ్వగా, 49 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళను వెల్లువెత్తాయి. ఫెయిల్‌ అయిన వారందరినీ పాస్‌ చేయాలనే డిమాండ్‌ సర్వత్రా వినిపించింది. దాంతో వేరే మార్గం లేక అందర్నీ పాస్‌ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అప్పట్లో ప్రకటించారు. ఈక్రమంలో ఈనెలలో విడుదలయ్యే టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement