Saturday, December 7, 2024

ఈసారి మరింత గ్రాండ్ గా.. థియేట‌ర్ల‌కు తిరిగి వ‌స్తున్న సూర్య భాయ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్ష‌న్ లో “గుంటూరు కారం” అనే సాలిడ్ మాస్ డ్రామా మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ష‌ర‌వేగంగా కొన‌సాగుతొంది. మరి ఈ మూవీ పై భారీ అంచనాలు ఉండగా మొన్న గ్లింప్స్ తో అదిరే హైప్ ని కూడా తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉండగా మరో క్రేజీ అప్డేట్ ని మహేష్ బర్త్ డే కానుకగా ఈ ఆగస్ట్ లో మేకర్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసారు.

దీంతో పాటుగా సూపర్ స్టార్ మాస్ హిట్ మూవీ “బిజినెస్ మెన్” రీ-రిలీజ్ తో చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. బిజినెస్ మెన్ సినిమా 4కే రీ-మాస్టర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక దీంతో థియేట‌ర్ల‌లో హంగామా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ మూవీని మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే థమన్ సంగీతం అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement