Sunday, May 5, 2024

ఈ బుజ్జి న‌వ్వుతూనే ఉంట‌ద‌ట‌.. ఆ చిన్నారి ముఖంపై శాశ్వత చిరునవ్వు..

తమకు చిన్నారి జన్మించిందన్న ఆనందం ఆ దంపతులకు కొన్ని క్షణాలు కూడా మిగలలేదు. వెడల్పాటి మూతితో ముఖం మీద శాశ్వత చిరునవ్వుతో జన్మించిన ఆ బేబీని చూసి కంగారు పడ్డారు. నోటి చివరలు సరిగా అతుక్కోకపోవడం వల్ల ఆ శిశువు నోరు చాలా వెడల్పుగా ఉంది. దీనిని బైలాటరల్‌ మాక్రొస్టొమియా అంటారని వైద్యులు అంటున్నారు. ఇది చాలా అరుదైన అవకరమని తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి లోపంతో జన్మించిన వారు 14 మంది మాత్రమే ఉన్నారు. పాప నోటికి ఆపరేషన్‌ చేసి రెండు చివరలను దగ్గరికి తీసుకురావలసి ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఈ విషయమై ఆ పాప తల్లి క్రిస్టినా వెర్చర్‌ (21), బ్లాయిజ్‌ ముచా (20) వైద్యులను సంప్రదిస్తున్నారు.

ఈ లోపం వల్ల పాప పాలు తాగలేదనీ, ముందుముందు ఆహారాన్ని తీసుకోవడం కష్టమవుతుందని వైద్యులు చెబుతున్నారు. జన్యు లోపం వల్లే ఇలా జరిగి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు క్రిస్టినా తెలియజేసింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఇలాంటి లోపాలతో పిల్లలు పుడుతారన్న అవగాహన కూడా మాకు లేదు అని ఆమె వివరించింది. చిన్నారి చూసిన ఇద్దరమూ ఒక్కసారిగా షాక్‌ గురయ్యామని, ఆందోళన చెందామని ఆ జంట తెలియజేసింది. చీలిన పెదాల చివర్లను అతికించినప్పుడు ముఖంపై పెద్దపెద్ద మచ్చలేర్పడుతాయేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు హామీ ఇస్తున్నారు. దక్షిణ ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌లో ఫ్లిండర్స్‌ మెడికల్‌ సెంటర్‌లో పాపకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement