Friday, May 3, 2024

అస్థిత్వానికి ముప్పొస్తే అణ్వాయుధాలతో దాడి.. క్రెవ్లిున్‌ ప్రతినిధి పెస్కోవ్‌ హెచ్చరిక

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో మళ్లీ అణాయుధాల ప్రకటన తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. క్రెవ్లిున్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ చేసిన వ్యాఖ్యలు యావత్‌ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. తమ దేశ అస్థితానికి ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని తేల్చి చెప్పారు. తమకు దేశీయ భద్రత అనే విధానం ఉందని, దానికి అనుగుణంగా తమ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ వ్యూహాత్మక అణ్వాయుధాల బలగాలను కూడా అప్రమత్తం చేశామని తెలిపింది. తాజాగా చేసిన కామెంట్లు.. ప్రపంచ దేశాలను మరింత ఆగ్రహంతో పాటు ఆందోళనలకు గురి చేసేలా ఉన్నాయి. అణ్వాయుధాలు వాడటానికి గల కారణాలు తెలియజేశాకే.. వాటిని ఉపయోగిస్తామని పెస్కోవ్‌ వెల్లడించారు.

అత్యంత ప్రమాదకరం : యూఎస్‌
రష్యా అణాయుధాల ప్రకటనపై అమెరికా తీవ్రంగా మండిపడింది. దిమిత్రీ పెస్కోవ్‌ చేసిన వ్యాఖ్యలను పెంటగాన్‌ ప్రతినిధి జాన్‌ కిర్బీ తీవ్రంగా స్పందించారు. రష్యా తీరు అత్యంత ప్రమాదకరమని ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన అణాయుధ దేశం ప్రవర్తించే విధానం ఇది కాదని విమర్శించారు. ప్రస్తుతం తమ వ్యూహాత్మక విధానంలో మార్పులేదని, తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటామని తెలిపారు. రష్యా ప్రకటన తరువాత.. అణ్వాయుధాల కదలిక సంకేతాలు లేవని పశ్చిమ దేశాలు పేర్కొంటున్నాయి. ఇరు దేశాలు శాంతి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని కోరాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement