Tuesday, April 30, 2024

TS | లక్ష సాయం దరఖాస్తుల గడువు పెంచేది లేదు.. విడతల వారీగా సహాయం చేస్తాం: మంత్రి గంగుల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీసీలకు ఆర్థికసాయం రూ.లక్ష అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకానికి గడువు మంగళవారంతో ముగిసిపోయింది. ఇప్పటికే అభ్యర్థులు లక్షల్లో దరఖాస్తు చేసుకుంటే ఇంకా చేసుకోని వారు ఇంకా ఎక్కువే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గడువు పెంచుతుందని ఆశగా ఎదురుచూస్తున్న బీసీలకు నిరాశే మిగిలింది. దరఖాస్తు గడువు పెంచేది లేదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఈమేరకు స్పష్టం చేశారు.

- Advertisement -

అయితే ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. అర్హులై లబ్ధిదారులకు జూలై 15న ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. బీసీ రుణాల పంపిణీ నిరంతరం జరిగే ప్రక్రియ అని ఈ రుణాలకు మళ్లిd దరఖాస్తులు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. విడతల వారీగా సహాయం అందిస్తామని, మరో విడత దరఖాస్తులకు మరో గడువు తేదీ ఉంటుందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement