Thursday, May 16, 2024

ఏపీలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రతిపాదన లేదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందా? ఢిఫెన్స్ కారిడార్లకు సేవలందించే విధంగా ఎన్‌సీసీ కేడెట్లకు సాంకేతిక శిక్షణ అందించనున్నారా? డిఫెన్స్ కారిడార్లలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏవైనా చేపట్టనున్నారా? ఉంటే వాటికి సంబంధించిన వివరాలు తెలపాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఎన్‌సీసీ కేడెట్లకు సాంకేతిక శిక్షణ ఇచ్చే ఆలోచన లేదని చెప్పారు.

యువతలో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, వివేకం, జ్ఞానం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించి తద్వారా వారు సమాజానికి నిస్వార్ధమైన సేవలు అందించడంతో పాటు, రక్షణ దళాల వైపు మొగ్గు చూపే లక్ష్యంతోనే ఎన్‌సీసీ కేడెట్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement