Thursday, May 2, 2024

స‌లార్ పోస్ట‌ర్-టెర్రిఫిక్ లుక్ లో ప్ర‌భాస్

ప‌లు భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.వాటిల్లో ఒక‌టి స‌లార్.డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కాగా స‌లార్ చిత్రం నుండి ప్ర‌భాస్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రభాస్ లుక్ టెర్రిఫిక్ గా ఉంది. ప్రశాంత్ నీల్ స్టైల్ లో బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ లో పోస్టర్ కనిపిస్తోంది. ఆరడుగుల కటౌట్ తో ఉండే ప్రభాస్ రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకుని శత్రువులని ఊతకోత కోస్తున్నాడు. దిమ్మ తిరిగేలా ఉన్న ఈ పోస్టర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ లో పూనకాలు మొదలయ్యాయి. ఊర మాస్ పోస్టర్ ఆంటూ కామెంట్స్ పెడుతున్నారు. ది ఎరా ఆఫ్ సలార్ బిగిన్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. కెజిఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే సంస్థే సలార్ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. సలార్ చిత్రం ఎలాంటి కథతో తెరకెక్కుతోంది అనే విషయంలో పూర్తిగా క్లారిటీ లేదు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.సలార్ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement