Thursday, May 2, 2024

చదువుకుంటాం.. సహాయం చేయండి చిన్నారుల వేడుకోలు..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : చదువుకునేందుకు ఇద్దరు చిన్నారులు ఆదుకోవాలంటూ సహాయం కోరుతున్నారు. నగరంలోని బోడుప్పల్‌ లో నివాసం ఉండే నవీన్‌ రెడ్డికి ఇద్దరు సంతానం. నవీన్‌ రెడ్డికి పుట్టకతోనే మాటలు రావు, చెవులు వినపడవు. నవీన్‌ రెడ్డి కూతురు సాయి శ్లోక తొమ్మిదవ తరగతి చదువుతుంది. బాబు లోకేష్‌ రెడ్డి నాలుగో తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా వీరి జీవితం మరింత భారంగా మారింది. కనీసం పిల్లల చదువులకి స్కూల్‌ ఫీజు కట్టలేని దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే పిల్లల స్కూల్‌ ఫీజులు అరవై వేలకు పైగా కట్టినా ఇంకా బకాయి ఉన్నట్లు స్కూల్‌ యాజమాన్యం చెప్పడంతో సహాయం చేయాలంటూ బాధితుడు నవీన్‌ రెడ్డి వేడుకుంటున్నాడు.

ఎవరైనా దాతలు ముందుకు వచ్చి చిన్నారుల చదువుకు సహాయపడి, వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరుతున్నాడు. నవీన్‌ రెడ్డికి సహాయం చేయాలనుకునేవారు. కెనారాబ్యాంక్‌ ఖాతాదారు పేరు పల్లివి అకౌంట్‌ నెంబర్‌ 8685118003755, ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ ఈకఇ0008685 కు పంపవచ్చని అంతేకాకుండా గూగుల్‌ పే, ఫోన్‌ ఫే నెంబర్‌ 9505703868 కు సహాయం చేయాలని కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement