Monday, April 29, 2024

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ వేయలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షలు జరపాలనుకుంటే అఫిడవిట్ ద్వారా వివరాలు చెప్పాలని, రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇన్నిరోజులైనా అఫిడవిట్ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. పరీక్షలపై అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా సర్కారే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా లేదా స్పష్టంగా చెప్పాలని ఏపీని ఆదేశించింది.

కాగా పరీక్షలను రద్దు చేయని ఏపీ సహా దేశంలోని నాలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు గతంలో నోటీసులు జారీ చేసింది. రద్దు చేసిన సీబీఎస్‌ఈ పరీక్షల మార్కుల కేటాయింపు విధానానికి ఆమోదం తెలిపే సందర్భంలో ఈ విషయం కోర్టులో చర్చకు వచ్చింది. 28 రాష్ట్రాలకు గానూ 18 రాష్ట్రాలకు చెందిన బోర్డులు ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయని, మిగిలిన ఆరు రాష్ట్రాలు కరోనా రెండో వేవ్‌కు ముందే పరీక్షలు నిర్వహించాయని పిటిషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement