Thursday, April 25, 2024

అమెజాన్ ప్రైమ్ వీడియోలో వార‌సుడు.. ఎప్పుడంటే

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన చిత్రం వార‌సుడు.ఈ చిత్రంలో హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న న‌టించింది.టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సాలీడ్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా అన్ని భాషల్లో కూడా భారీ బిజినెస్ ని జరుపుకుంది. ఇక ఈ డీల్ లో సినిమా ఓటిటి హక్కులు కూడా భారీ ధ‌రకి అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా రిలీజ్ కావడంతో ఈ చిత్రం అఫీషియల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ పై అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోవారు సొంతం చేసుకున్నారు. మరికొన్ని నెలల తర్వాత అయితే ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుంది.వార‌సుడు చిత్రాన్ని అమెజాన్ ప్రేమ్ వీడియోవారు సొంతం చేసుకున్నారు. వారిసు తమిళ్ వెర్షన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement