Sunday, April 28, 2024

Teaser | ఇది గాందీ గ్రామం కాదంటూ పంచ్‌ డైలాగ్‌.. ‘కింగ్ ఆఫ్ కోథా’లో దుల్క‌ర్ రోల్ ఏంటోమ‌రి!

నూత‌న ద‌ర్శ‌కుడు అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ మూవీలో ఇది గాంధీ గ్రామాం కాదు అంటూ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ పంచ్ డైలాగ్ ఉంటుంది. కింగ్ ఆఫ్ కోతా సినిమాకు సంబంధించిన ప‌వ‌ర్‌ఫుల్ టీజ‌ర్ ఇవ్వాల (బుధ‌వారం) రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఆగస్ట్ లో రిలీజ్‌కి సిద్ధమవుతోంది. కాగా, వేఫేరర్ ఫిలిమ్స్, ZEE స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ నుంచి తెలుగు టీజర్‌ను మహేష్ బాబు ఆవిష్కరించారు.

కథ పెద్దగా రివీల్ చేయనప్పటికీ, ఒకటిన్నర నిమిషాల టీజర్‌లో సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో మేకర్స్ శక్తివంతమైన సంగ్రహావలోకనం ఇచ్చారు. అద్భుతమైన నిర్మాణ విలువలు, నిమిష్ రవి అద్భుతమైన సినిమాటోగ్రఫీ, దుల్కర్ స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్‌గా నిలిచాయి. టీజర్‌లో కీలక పాత్రలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే దుల్కర్ తెలుగులో తన పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. డ్యాన్సింగ్ రోజ్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షాన్ రెహమాన్, జేక్స్ బిజోయ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement