Thursday, April 25, 2024

మెటా నుంచి కొత్త మైక్రోబ్లాగింగ్‌

ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా నుంచి త్వరలోనే కొత్త మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ రానుంది. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన తరువాత ఎన్నో మార్పులు చేస్తున్నారు. ట్విటర్‌కు సబ్‌స్క్రిప్షన్‌ విధానం తీసుకు వచ్చారు. ఉద్యోగుల సంఖ్యను భారీగా తొలగించారు. బ్లూ టిక్‌ విధానంలోనూ పలు సార్లు మార్పులు చేశారు. దీంతో ఈ మార్పులు చాలా మందికి నచ్చలేదు. చాలా మంంది ప్రత్యామ్నాయ వేదికల వైపు చూస్తున్నారు. ఇప్పటికే ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా ఆ సంస్థ మాజీ సీఈఓ జాక్‌ డోర్సీ బ్లూ స్కై పేరుతో ఒక సైట్‌ను తీసుకు వచ్చారు. తాజాగా ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా కూడా ట్విటర్‌కు పోటీగా మైక్రోబ్లాగింగ్‌ యాప్‌ను తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌ బ్రాండ్‌పై కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతున్నట్లు టెక్ సంబంధిత వర్గాలు సమచారం. దీనిపై ఇప్పటికే మెటా టెస్టింగ్‌ నిర్వహిస్తోందని తెలుస్తొంది. దీనిపై ఎంపిక చేసిన కొంతమందితో టెస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధిత స్క్రీన్‌ షాట్లు సైతం బయటకు వచ్చాయి. ఈ యాప్‌కు ఇంత వరకు పేరు పెట్టలేదు. టెస్టింగ్‌ సమయంలో దీన్ని పీ92, బార్సిలోనా పేర్లతో వ్యవహరిస్తున్నారు. మెటా దీన్ని సపరేట్‌ యాప్‌గా తీసుకు వస్తోంది. ఇన్‌స్టా యూజర్లకు వారి అకౌంట్‌ ద్వారా కనెక్ట్‌ అయ్యేందుకు వీలు కల్పించనున్నారు. ఈ యాప్‌ జూన్‌ నాటికి యూజర్లకు కూడా అందుబాటులో వస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌కు ఈ యాప్‌ కొంచెం భిన్నంగా ఉండనుంది. ఫోటోలు, వీడియోలతో కూడిన కంటెంట్‌తో పాట టెక్ట్స్‌ ఆధారిత టైమ్‌ లైన్‌ పోస్టులు ఉంటాయి. ట్విటర్‌లో ప్రస్తుతం ఎలా ఉందో అలానే ఇది ఉంఉంది. ఇందులో 500 అక్షరాల వరకు టెక్ట్‌ ్స చేసుకునే వీలు కల్పించనున్నారు. ఇన్‌స్టా ను ఫాలో అవుతున్న వారికి ఒక క్లిక్‌తో ఈ కొత్త యాప్‌కు యాక్సెస్‌ ఇవ్వనున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా భారీగా యూజర్ల బేస్‌ను సంపాదించుకున్న మెటా కొత్త యాప్‌తోనూ ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement