Thursday, May 2, 2024

మోడీకి కొత్త కారు.. రూ.12కోట్లపైనే..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక నుంచి కొత్త కారులో ప్రయాణించనున్నారు. ఆయన కాన్వాయ్‌లోకి మెర్సిడెస్‌ మే బ్యాక్‌ ఎస్‌ 650 వచ్చి చేరింది. ముందు బుల్లెట్లు, పేలుళ్లు సంభవించినా.. సురక్షితంగా ప్రయాణం చేసేలా రూపొందించారు. ఇటీవల ఒక్క రోజు భారత్‌ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు స్వాగతం పలకడానికి హైదరాబాద్‌ హౌస్‌కు వచ్చిన మోడీ, తొలిసారి ఈ కారులో కనిపించారు. అలాగే ఈ మధ్య మోడీ కాన్వాయ్‌లో మరోసారి ఈ వాహనం కనిపించింది. అత్యున్నత భద్రతా ప్రమాణాలు కలిగిన ఈ కారు విలువ రూ.12 కోట్లపైనే ఉంటుందని తెలుస్తోంది. కొత్త మేబ్యాక్‌ 650 గార్డ్‌ వీఆర్‌ 10 స్థాయి రక్షణతో సరికొత్త ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ ఇది. ప్రత్యేకంగా తయారు చేసిన నిర్మాణంతో బుల్లెట్ల వర్షాన్ని తట్టుకోగలదు. ఏకే-47 రైఫిల్స్‌ దాడిని కూడా ఎదుర్కోగలదు. గ్యాస్‌ దాడి జరిగినప్పుడు క్యాబిన్‌ నుంచి ప్రత్యేక గాలి కూడా విడుదల అవుతుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రధాని మోడీ కాన్వాయ్‌లోని వాహనాలను ఎస్‌పీజీ అధికారులు అప్‌గ్రేడ్‌ చేశారు.

ఈ కారు ఎక్స్‌ప్లోజివ్‌ రెసిస్టెంట్‌ వెహికిల్‌ (ఈఆర్‌వీ) 2010 రేటింగ్‌ను కలిగి ఉంది. మెర్సిడెస్‌ మే బ్యాక్‌ ఎస్‌ 650 గార్డ్‌ 6.0 లీటర్‌ ట్విన్‌ టర్బో వీ12 ఇంజిన్‌తో శక్తిని పొందింది. ఇది 516 బీహెచ్‌పీ పవర్‌, 900 ఎన్‌ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఈ కారులో కూర్చున్న వ్యక్తి కేవలం 2 మీటర్ల దూరంలో సంభవించే 15 కిలోల వరకు టీఎన్‌టీ పేలుడు నుంచి కూడా సురక్షితంగా ఉండగలడు. ప్రత్యేకమైన టైర్లు కారు ఇంధన ట్యాంకు ఒక ప్రత్యేక పదార్థంతో పూత పూయబడి ఉంటుంది. ఇది బుల్లెట్‌ వల్ల ఏర్పడిన రంద్రాన్ని స్వయంచాలకంగా మూసివేస్తుంది. ఇది బోయింగ్‌ ఏహెచ్‌ 6 అపాచీ ట్యాంక్‌ దాడి హెలికాప్టర్లలో ఉపయోగించిన అదే పదార్థంతో తయారు చేయడం జరిగింది. కారు ప్రత్యేకమైన రన్‌ ప్లాట్‌ టైర్లతో కూడా నడపొచ్చు. దీని కారణంగా దాడి తరువాత టైర్లకు నష్టం జరిగినప్పుడు కూడా ఇది వేగంగా ప్రయాణిస్తుంది.

కారు సీట్‌ మసాజర్‌తో విలాసవంతమైన ఇంటీరియర్‌తో ఉంటుందా. ఈ అక్యుపెంట్‌ కోసం లెగ్‌రూంను పెంచొచ్చు. నరేంద్ర మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బుల్లెట్‌ ప్రూఫ్‌ మహీంద్రా స్కార్పియోలో ప్రయాణించేవారు. 2014లో ప్రధాని అయిన తరువాత.. బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ హై సెక్యూరిటీ ఎడిషన్‌ను ఉపయోగించారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి మెర్సిడెస్‌ మే బ్యాక్‌ ఎస్‌ 650 వచ్చి చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement