Monday, April 29, 2024

రామగుండం ప్రజల చిరకాల వాంఛ.. మెడికల్ కాలేజీ ఏర్పాటు.

గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నూతనంగా ఏర్పాటు కానున్న మెడికల్ కళాశాల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి న్యాయకత్వంలో పేద ప్రజలకు ఉచితంగా వైద్యన్ని అందించాలన్న సంకల్పంతో ప్రతి జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడానికి అహర్నిషలు పాటుపడుతున్నరన్నారు. రామగుండం ప్రాంతంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ కు విన్నవించడం జరిగిందని రామగుండం ప్రాంత ప్రజలపై సిఎంగారికి ఉన్న అభిమానంతో మెడికల్ కళాశాల మాంజూరు చేశారన్నరు.

మెదటగా 49 కోట్లతో మెడికల్ కళాశాల పనులు ప్రారంభమయ్యయన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంత కార్పోరేట్ వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. రోగులకు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా వైద్యం అందుతుందన్నారు. రామగుండానికి మెడికల్ కళాశాల మాంజూరు చేసిన ఆరోగ్య ప్రధాత సిఎం కేసీఆర్ గారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement