Thursday, March 28, 2024

ఈ ఏడాది ట్వీట్లు.. రీట్వీట్ల‌తో ఫుల్ షేర్ అయ్యింది.. కోహ్లీ, ధోనీ ట్వీట్ల‌లో మోస్ట్ పాపులర్ ఇదే..

2021లో భారత క్రీడల్లో అత్యధికంగా ట్వీట్లు, రీట్వీట్లతో షేర్ అయ్యింది.. జ‌నాలు ఎక్కువ‌గా లైక్ చేసిన ట్వీట్ ఏదైనా ఉంది ఉంటే అది ఇదే అని చెప్పొచ్చు. IPL సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో MS ధోని మ్యాచ్ విన్నింగ్ ఆట తీరుపై విరాట్ కోహ్లీ చేసిన ప్రశంసలకు సంబంధించిన పోస్టు ఇది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చివరి ఓవర్ మాస్టర్‌స్ట్రోక్‌తో MS ధోని సంద‌డి చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఫైన‌ల్‌కి తీసుకెళ్లాడు. ఆ స‌న్నివేశాన్ని క్రికెట్ ల‌వ‌ర్స్ ఎంతో ఎంజాయ్ చేశారు. అయితే ఈ ఆట‌లో స్ట‌న్నింగ్‌కు గురైన ధోనీ అభిమానుల్లో విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. భారత టెస్ట్ కెప్టెన్ స్వయంగా తన సమకాలీనుడిని ‘కింగ్’ అని పిలిచి హృదయపూర్వక ప్రశంసలతో ట్వీట్‌లో ప్రశంసించాడు.

ఈ ట్వీట్ అత్యధికంగా రీట్వీట్ అవుతూ.. షేరింగ్‌లో టాప్‌లో ఉంది.. 2021లో క్రీడలలో అత్యధికంగా లైక్ చేయబడిన ట్వీట్‌గా మారింది. జనవరి 1 నుండి నవంబర్ 15, 2021 మధ్య దేశంలో Twitter ఖాతాల ద్వారా మొత్తం రీట్వీట్‌లు/లైక్‌ల సంఖ్య ఆధారంగా Twitter ఉపయోగించే పద్దతి పరిశీలిస్తే ఇదే టాప్ లో ఉన్నట్టు తేలింది.

‘‘కింగ్ బ్యాక్ ద అన‌ద‌ర్ ఫినిష‌ర్ ఎవ‌ర్ ఇన్ గేమ్‌. మేడ్ మి జంప్ ఔట్ మై సీట్ వ‌న్స్ అగైన్ ద‌ట్ నైట్‌.. @msdhoni,” Kohli tweeted on October 10.

Advertisement

తాజా వార్తలు

Advertisement