Sunday, May 5, 2024

జర్నీ మొదలైన చోటే ముగింపు.. కంటతడి పెట్టి భావోద్వేగానికి లోనైన టెన్నిస్‌ క్వీన్‌ సానియా

హైదరాబాద్‌: భారత టెన్నిస్‌ క్వీన్‌ సానియా మిర్జా ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్‌వెల్‌ (వీడ్కోలు)మ్యాచ్‌తో సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం సానియా కంటతడి పెట్టుకుని భావో ద్వేగానికి లోనైంది. ఈ వీడ్కోలు మ్యాచ్‌తో సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికింది. కొద్ది రోజుల క్రితం ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మిర్జా ఫేర్‌వెల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో పాల్గొంది. తన చివరి మ్యాచ్‌ సింగిల్స్‌లో సానియా, బోపన్న జోడి వర్సెస్‌ ఇవాన్‌ డోడిక్స్‌, మ్యాటెక్‌ సాండ్స్‌ తలపడ్డారు. సింగిల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్నతో జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన సానియా తన 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ కంతడి పెట్టింది. ఈ సందర్బంగా సానియా కొడుకు అమ్మ గ్రేట్‌ అంటూ తన ప్రేమను వ్యక్తం చేయడంతో స్టేడియం మొత్తం హర్షద్వానాలు మారుమ్రోగింది.

- Advertisement -

”20 ఏళ్లు దేశం తరపున ఆడడం నాకు దక్కిన గొప్ప గౌరవం. తమ దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతి నిథ్యం వహించాలనేది ప్రతీ క్రీడాకారిణి కల. నేను అలా చేయగలిగాను ” అని తన ప్రయాణంలో తనకు మద్దతిచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది సానియా. అనంతరం ఒక్కసారిగా భావో ద్వేగానికి లోనయింది. ”ఇవి చాలా సంతోషకరమైన కన్నీళ్లు”. ఇంతకంటే మంచి సెండ్‌ ఆఫ్‌ కోసం నేను అడగలేకపోయాను” అని ఆమె చెప్పింది. దేశంలో చాలా మంది సానియాలు ఆవిర్బవించాలని ఆమె ఆకాంక్షించింది. అయితే మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో కొందరు అభిమానులు మేము నిన్ను మిస్‌ అవుతున్నాం సానియా అని రాసి ఉన్న ప్ల కార్డులను పట్టుకున్నారు. అంతకుముందు ఆమె కోర్టులోకి ప్రవేశించినప్పుడు ప్రేక్షకులు , పిల్లలు ఆమెను ఉత్సాహపరిచారు.

ఈ చివరి మ్యాచ్‌ చూసేందుకు అభిమానులతో బాటు రాజకీయ, క్రీడా ప్రముఖులు పలువురు హజరయ్యారు. తెలంగా ఐటీ పురపాలక మంత్రి కెటీఆర్‌తో పాటు సినీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌, మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, అజారుద్దీన్‌, ప్రముఖ భారతీయ రాపర్‌ , గీత రచయిత ఎంసీ స్టాన్‌ తదితరులు ఎల్బీ స్టేడియంకు వచ్చి మ్యాచ్‌ తిలకించారు. స్టేడియంకు పెద్ద ఎత్తున తరలి రావడంతో స్టేడియం వద్ద సందడి నెలకొంది. మ్యాచ్‌ అనంతరం రాత్రి ప్రముఖ హోటల్‌ రెడ్‌ కార్పెట్‌లో ఈవెంట్‌, గాలా డిన్నర్‌ జరిగింది. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు, సినీ నటుడు మహేష్‌ బాబు, సంగీత దర్శకుడు ఎఆర్‌ రహమాన్‌ తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement