Friday, May 10, 2024

పీఆర్సీకి 10వేల కోట్లు… 2లక్షల కోట్ల బడ్జెట్ !

పెరిగిన ఆర్ధిక అవసరాలకు ధీటుగా రాబడిని పెంచుకునే లక్ష్యంతో అధునాతన పద్ధతిలో, వాస్తవిక కోణంలో వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం నేడు శాసన సభలో ప్రవేశ పెట్టనుంది. నేటి ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ఆర్ధిక శాఖా మంత్రి 2021-22 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడ్తారు. పలు ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఈ దఫా కొత్త పథకాలు, పీఆర్సీ వంటి వాటికి ప్రభుత్వం భారీగా నిధులను బడ్జెట్ లోనే పొందుపర్చింది. నిరుద్యోగ భృతిపై ఇంకా ఎటు వంటి నిర్ణయం తీసుకోని సర్కార్ ఈ పథకంపై అసెంబ్లీ వేదిక గానే కీలక ప్రకటన చేయనుందని, సానుకూలంగా ఉంటే బడ్జెట్ లో పద్దు ఉండే అవకాశం కూడా లేకపోలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి అవసరమైన రూ. 8వేల కోట్ల కేటాయింపులపై సందిగ్ధత నెలకొంది. మొత్తం మీద గడచిన 4 మాసాలుగా పెరిగినసొంత వనరుల వృద్ధిరేటు అంచనాలతో 10శాతం వృద్ధిరేటుతో రూ.1.90 వేల కోట్ల నుంచిరూ. 2 లక్షల కోట్లలోపు బడ్జెట్ పద్దు ఉండనుంది. ఈ మేరకు ప్రభుత్వం వ్యయాలు, రాబడుల అంచనాలకు ప్రణాళికలు వేస్తోంది. ప్రస్తుత ఆర్ధిక యేడాది కరోనా విపత్తుతో రూ. 55 వేల కోట్ల రాబడిలోటు ప్రత్యక్షంగా మరో రూ. 50వేల కోట్లు పరోక్షంగా ప్రభావం చూపింది. లోటులోనే ఉన్నప్పటికీ వచ్చే ఏడాది బడ్జెట్ లో సంక్షేమ పథకాలన్నీ ఖచ్చితంగా అమలు చేయడమే కాదు, కొత్త పథకాలు, ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దార్శనిక దృక్పథంతో వ్యవహరిస్తోంది. వ్యవసాయం, సంక్షేమం, వైద్యం, ఇరిగేషను అధిక నిధులు కేటాయించి ప్రాధాన్యతనిచ్చేలా పద్దును సిద్ధం చేసింది.

గడచిన ఏడాదిగా రాష్ట్ర రాబడులు తగ్గినప్పటికీ ఇతర మార్గాల్లో సమీకరించుకున్న ఆదాయాలను ఖర్చు చేస్తోంది. తద్వారా ఈ ఏడాదిలో కరోనా విపత్తుతో నిల్చిన రాబడులు, కేంద్రసాయంలో కోతలు, పెండింగ్ బకాయిలు, ఆర్థిక మాంద్యం ప్రభావాలను సంక్షేమ పథకాలపై పడనీయకుండా ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. ఆర్థిక సమన్వయంలో భాగంగా అర్ధవంతమైన ఉపాధిని పెంచుతూ, ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు అనేక చర్యలు తీసుకోనుంది. పేదరికాన్ని తగ్గించే చర్యలు, అక్షరాస్యత పెంపు కార్యాచరణ, విద్య, వైద్యం, ఇతర సదుపాయాలను ఆధునీకరించేందుకు చర్యలను తీసుకుంటోంది. ఈ ఏడాది కూడా మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి,
వ్యవసాయం, అనుబంధ రంగాలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడి వ్యయాల పెంపు లక్ష్యంగా భారీ మొత్తాలకు ప్రభు త్వం సిద్ధమైంది. సంపద సృష్టిలో భాగంగా నీటిపా రుదల, ప్రాజెక్టులు, రవాణా, మౌలిక వసతులకు పెద్ద పీట వేయనుంది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ. 20వేల కోట్లు, ఇరిగేషను రూ. 22వేల కోట్లు, పీఆర్సీకి రూ.10 వేల కోట్లు, ఒకవేళ నిరుద్యోగ భృతి ప్రకటించాల్సి వస్తే ఈ పద్దుకు 20 లక్షల మందికిగానూ రూ. 8వేల కోట్లు, సామాజిక పింఛనళ్లురూ.11వేల కోట్లు, ఉద్యోగుల వేతనాలు, పింఛనళ్లు రూ. 38వేల కోట్లు, రాష్ట్ర రాబడిలో కనిపిస్తున్న వృద్ధిరేటును అంచనా వేసుకుంటూ సొంత వనరులపై భారీగా పెంపును వర్తింపజేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం ఆదాయం రూ.1.18వేలకోట్లు రాగా, రూ.1.10 లక్షల కోట్లు వ్యయం చేశారు. ఇప్పటికే సుమారు. రూ. 45 వేల కోట్లు రుణాలు సేకరించారు. వచ్చే ఏడాది రూ. 50వేల కోట్ల అప్పులు,భూములు, దిల్ ఆస్తులు, రాజీవ్ స్వగృహ ఇండ్ల విక్రయాలతో పన్నేతర ఆదాయంగా రూ.30వేలకోట్లను అంచనా వేసినట్లుసమాచారం. స్థిరాస్తికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో మార్కెట్ విలువలను పెంచి రిజిస్ట్రేషన్ల శాఖ అంచనాలను పెంచనున్నారు. ఆబ్కారీ లక్ష్యం కూడా భారీగా పెంచుకోనున్నారు. జీఎస్టీరాబడి పెరుగుదల నేపథ్యంలోరూ.50వేలకోట్లకుపైగాలక్ష్యం నిర్దేశించనున్నారు. ప్రజల కొనుగోలు శక్తిని అంతకంతకూ పెంచడం, పెట్టుబడి వ్యయానికి నిధులు వినియోగించడమనే ద్విముఖ వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కు శ్రీకారం చుట్టింది. పన్నేతర ఆదాయంపై ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంటున్నది. వస్తున్న ఆదాయ వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం, బయటి నుంచి నిధుల సమీకరణ, పన్నులనుపెంచకుండా రాబడిని ఆర్జించే వెసులుబాటులను ప్రభుత్వం పరిశీలించింది.

ఇసుక రీయేతో రాబడి, ఆబ్కారీ పాలసీలో మార్పులు, భూముల వేలం, జీఎస్టీ ఎగవేతలు, బకాయిల వసూలు, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల వసూలుకు ప్రాధాన్యతనిస్తోంది. రైతు రుణమాఫీకి రూ. 6,500కోట్లు, రైతు బంధుకు రూ. 15000 కోట్లు, ఆసరా పించన్లకు రూ. 11వేల కోట్లు, డబుల్బెడ్ రూం ఇండ్లకు రూ. 30వేల కోట్లు, ఉచిత విద్యుత్ కు రూ. 4వేల కోట్లు, ఆరోగ్య శ్రీ సేవలకు రూ. 1000 కోట్లు, సబ్సిడీ బియ్యానికి రూ. 8వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిసింది. తాజాగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో లేకపోవడంతో కొత్త పథకాలు అమలు, పాత పథకాల కొనసాగింపుతోపాటు, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పించన్లు రెండింతలు, వయో పరిమితి 57 ఏళ్లకు తగ్గించడంతో కొత్తగా అర్హత సాధించనున్న పించర్లపై అధ్యయనం మొదలైంది. భూముల వేలం, మార్కెట్ విలువల సవరణ, నూతన బార్లకు అనుమతులు, ఇసుక పాలసీ, రవాణా పన్నుల వసూళ్లు, అంతరాష్ట్ర సర్వీసులపై కూడా కొంత కఠినంగా వ్యవహరించి ఆదాయం రాబట్టేలా ప్రణాళికలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement