Thursday, May 2, 2024

బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆర్థిక అభివృద్ధికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది : ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందే ఏ కార్యక్రమాన్నైనా వైఎస్సార్సీపీ సమర్థిస్తుంద‌ని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. మత్స్యకారుల ఆరాధ్య దైవాలైన పోలమాంబ, కొత్తమాంబ ఆలయాలు నిర్మించాలని వారి విజ్ఞప్తి చేయ‌గా, సీఎం ఆదేశాల మేరకు దేవాలయాల నిర్మాణం చేపట్ట‌డం జ‌రిగింద‌ని ఎంపీ పేర్కొన్నారు. రీటైనింగ్‌ వాల్‌ పూర్తయిన తరువాత ఆలయ నిర్మాణం ప్రారంభం అవుతుంద‌న్నారు. తమిళనాడు శిల్పుల చేత ఆలయ నిర్మాణం చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు. వేల సంవత్సరాలు దేవతా మూర్తులు పూజలు అందుకోవాలన్నదే సీఎం ముఖ్య‌ ఉద్దేశ్యం అన్నారు. 9 నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తిచేస్తామ‌న్నారు. సింహాచలం దేవస్థానం కాంపౌండ్‌ వాల్‌ అతి త్వరలో ప్రారంభించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అయ్యన్నపాత్రుడు చెరువు కాలువను ఆక్రమించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంద‌ని, సంబంధిత అధికారులు పూర్తి వివరాలను పరిశీలించిన తరువాత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంద‌న్నారు. ఎవరు అవునన్నా, కాదన్నా విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌) అవుతుంద‌న్నారు. ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ను అడ్డుకునే సత్తా చంద్రబాబుకు లేద‌న్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ ఆలస్యం అవుతోంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement