Tuesday, May 14, 2024

మ్యాన్ హోల్‌లో పడిన బాలిక

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్ ఓ బాలికను బలి తీసుకునేది. కానీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో బాలిక ప్రాణాలతో బయటపడింది. ఫుట్ పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న బాలిక అకస్మాత్తుగా మ్యాన్ హోల్‌లో పడిపోయిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మధు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సాకేత్ పరిధిలోని మధురా నగర్‌లో నివాసముంటున్న శ్రుతి (13) శుక్రవారం రాత్రి 9:30 గంటల సమయంలో పుట్ పాత్‌పై నడుచుకుంటూ షాపుకు వెళ్తున్న క్రమంలో మ్యాన్ హోల్ కవర్ పగిలి మ్యాన్ హోల్లో పడిపోయింది.

స్థానికుల సమాచారంతో పెట్రోలింగ్ వాహన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే శృతిని బయటకు తీసి రక్షించారు. భయబ్రాంతులకు గురైన శృతికి కానిస్టేబుల్ పవన్, డ్రైవర్ హోం గార్డ్ నర్సింగ్ మనోధైర్యాన్ని కల్పించి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రత్యామ్నాయంగా వాహన తనిఖీ స్టాపర్ తో మ్యాన్ హోల్ ని కప్పారు. బాలికను కాపాడిన జవహార్ నగర్ పోలీసులను స్థానికులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement