Saturday, April 27, 2024

ఇవ్వాల సాయంత్రం గం4:05నిమిషాల‌కి ది ఘోస్ట్ ట్రైల‌ర్ రిలీజ్

ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్ తెర‌కెక్కిస్తోన్న హై వోల్టేజ్ యాక్ష‌న్ మూవీ ది ఘోస్ట్..ఈ సినిమాలోని యాక్షన్ దృశ్యాలు హాలీవుడ్ చిత్రాలను తలపించేలా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రంలో హీరోగా నాగార్జున న‌టిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తయ్యాయి. కాగా నేటి సాయంత్రం 4.05 గంటలకు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌ కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ద్వారా చిత్ర బృందం పేర్కొంది. కాగా ఈ చిత్రానికి ది ఘోస్ట్ అనే టైటిల్ పెట్టి మొదటినుండే క్యూరియాసిటీని పెంచేసింది చిత్ర బృందం. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన యాక్షన్ ప్రోమో,ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఈ మూవీలో నాగార్జున ఓ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో అందాల భామ సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గా ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement