Wednesday, March 27, 2024

శక్తి – భక్త్తి -ముక్తి – పురుషకారమంటే (ఆడియోతో..)

రక్షించే శక్తిని శ్రీ అని వ్యవహరిస్తారు. అమ్మవారిని ఆశ్రయించడం వల్ల ఆమె ద్వారా భగవంతుడు లభిస్తాడు. లక్ష్మి ‘పురుషకార’మని ‘లక్ష్మీతంత్రము’లో చెప్పబడింది.

”మత్ప్రాప్తం ప్రతి జంతూనాం సంసారే పతతా మిథ:
లక్ష్మి: పురుషకారత్వే నిర్ధిష్ఠ పరమర్శిభి:
మమాపిచ మతం హ్యేతత్‌ నాన్యథా లక్షణం భవేత్‌”

సంసారసాగరంలో మునిగి ఉన్న జీవులు నన్ను పొందవలెనంటే లక్ష్మీదేవిని పురుషకారముగా స్వీకరి ంచాలని పరమర్షులు నిర్ణయించారు. ఇంతకు మించి ఇంకొక దారే లేదు.. అని ఈ శ్లోకానికి అర్థం. ‘పురు సనోతి ఇతి పురష:’ అంటే పూర్ణముగానిచ్చువాడు పురుషుడు అని దాని అర్థం. దేనిని పొందిన తరువాత ఇక ఇంకొకటి పొందవలెనని ఆశ కలుగదో అది పూర్ణము. ఈ సంసారములో ఎన్నిని పొందినప్పటికీ ఇక చాలనిపించదు. కానీ కోరికలను కలుగుజేయని పరిపూర్ణమైన తృప్తి కలుగుజేసేది మోక్షమే. ఆ మోక్షనిచ్చువాడు పురుషుడు. పరమాత్మ మోక్ష మిచ్చునట్లు చేసేదే పురుషకారము అని అర్థం. భగవంతుడిని పూర్ణుని చేసేదే పురుషకారము. భగవంతుడు పూర్ణుడు అయి ఉండాలా? అసలు వేటితో పూర్ణుడై ఉండాలి? భగంవంతుడు గుణములలో పూర్ణుడై ఉండాలి. భగవంతుడికి కారుణ్య, వాత్సల్య, ఔదార్య, సౌశీల్య, సౌందర్యాది గుణములు లేవా? అంటే ఉన్నాయి. కానీ అవి స్వాతంత్య్రం వల్ల మరుగున పడ్డాయి. అలా మరుగునప డిన గుణాలను బయటకు తెచ్చి జీవులను పరమాత్మ చేత రక్షింపజేయడం, పరమాత్మను రక్షింపజేసే వాడిగా చేయడమే పురుషకారమంటారు. ఆ పని చేసేదే శ్రీదేవి.

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement