Thursday, May 2, 2024

Exclusive | ‘మణిపూర్ ఫైల్స్’ సినిమా తీయాలి.. సామ్నా పత్రికలో శివసేన చురకలు​!

మణిపూర్ హింసాత్మక ఘటనలపై మహారాష్ట్రలోని శివసేన మండిపడింది. కాశ్మీర్​ ఫైల్స్​, కేరళ స్టోరీ తరహాలో ఇప్పుడు ‘మణిపూర్ ఫైల్స్’ పేరుతో సినిమా తీయాలని చురకంటించింది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)..  కేంద్రంలోని బీజేపీ, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగింది. కశ్మీర్ లో కంటే మణిపూర్ లో దారుణమైన పరిస్థితులున్నాయని తమ సొంత పత్రిక సామ్నాలో రాసుకొచ్చింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోకపోయి ఉంటే, ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదిపేవారు కాదని ఆ పార్టీ పత్రిక సామ్నాలో శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాష్కేంట్ ఫైల్స్, ది కశ్మీర్‌ ఫైల్స్‌, ది కేరళ స్టోరీ పేరుతో సినిమాలు తీశారని.. ఇప్పుడు వారు మణిపూర్‌ ఫైల్స్ పేరుతో సినిమా తీయాలని శివసేన పేర్కొంది. మణిపూర్‌లో కనుక బీజేపీయేత ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసేవారని ఘాటుగా విమర్శలు గుప్పించింది. రాజకీయపరంగా ప్రధాని మోదీకి మణిపూర్‌తో పెద్దగా ప్రయోజనం లేదని, అందుకే అక్కడి ఘర్షణలను పట్టించుకోలేదని శివసేన ఆరోపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement