Thursday, May 2, 2024

TTD | శ్రీ‌వారి భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటా రిలీజ్‌

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ గుడ్‌ న్యూస్ చెప్పింది. ఆగస్టు, సెప్టెంబరు నెల‌లకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను జులై 25న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్ర‌క‌టించింది. అదే రోజు అక్టోబరు కోటాను కూడా విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుమ‌ల శ్రీ‌వారి అంగప్రదక్షిణ టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జులై 24వ తేదీన‌ ఉదయం 10 గంట‌ల‌కు విడుదల చేయ‌నున్నారు. శ్రీవాణి ట్రస్టు దాతలకు దర్శనం, గదులకు సంబంధించి అక్టోబరు కోటాను జులై 24న ఉదయం 11 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నారు.

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను జులై 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చుయ‌నున్న‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement