Monday, April 29, 2024

లెక్చరర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు పరీక్ష తేదీలు ఖరారు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సాంకేతిక విద్య, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్‌సీ ఖరారు చేసింది. సెప్టెంబర్‌ నెలలో వీటిని నిర్వహించనున్నట్లు ఈమేరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను ఈ నెల 4, 5, 6, 8వ తేదీల్లో టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించనుంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు ఈనెల 11వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే లెక్చరర్‌ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 12, 13, 14, 20, 21, 22, 25, 26, 27, 29వ తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement