Sunday, May 26, 2024

మెట్రోకు తగ్గుతున్న ఆదరణ

కరోనా ప్రభావం రాష్ట్రంలోని రవాణా రంగంపై తీవ్రంగా పడింది. ప్రయాణికులు లేకపోవడంతో ఆర్టీసీ, రైల్వేలు తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ఇకపోతే ఓలా, ఉబర్ల వాహనాలను నడిపే వారిలో చాలా మంది ఇళ్ళకే పరిమితమయ్యారు. ఓలా ఉబలలో ఎవరు ప్రయాణిస్తారు, ఎవరు పాజిటివ్, ఎవరికి కరోనా లక్షణాలున్నాయి అన్న విషయంలో సందిగ్ధతతో చాలా మంది ఓలా, ఉబర్లకు వాహనా లను నడపడం లేదు. అంతేకాకుండా నడుస్తున్న టాక్సీలకు కూడా అంతంత మాత్రంగానే ఆధరణ ఉండటంతో ఆ కంపనీలు కూడా వాహనాలను నడపాలన్న వత్తిడి చేయడం లేదు. ప్రజా రవాణాను వినియోగించుకునే వారిలో చాలా మంది స్వంత వాహనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటంతో మార్చినెల నుంచి హైదరాబాద్ మెట్రోకు కూడా అంతంత ఆధరణే లభిస్తోంది. మెట్రోలో ప్రయాణాలకు నగర వాసులు ఇష్టపడక పోవడంతో అనుకున్నంత కలెక్షన్ కూడా రావడం లేదని మెట్రో రైల్ యాజమాన్యం పేర్కొంటోంది.

మార్చి నెల వరకు మెట్రోలో రోజుకు దాదాపు 2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా, ఏప్రిల్ నుంచి సగానికి సగం రాకపోకలు తగ్గాయని అంటున్నారు. గత ఏడాది లాక్ డౌన్
విధించినపుడు పూర్తిగా మెట్రోరైళ్ళురద్దయ్యాయి. ఆ తర్వాత దాదాపు ఆరు మాసాల పాటు నడిచినా నష్టాలలోనే ఉంది. ఇప్పుడిప్పుడే కొంత లాభాల బాట పట్టింది. మళ్ళీ సెకండ్ వేవ్ తో మెట్రోపై పిడుగుడిందని అంటున్నారు.

అలాక్ తర్వాత 100 మంది కూర్చునే బోగీలో ఒక సీటును వదిలి ఒకసీటులోనే కూర్చునేలా ఏర్పాట్లు చేయడంతో 50 మంది మాత్రమే కూర్చుంటున్నారు. అయినప్పటికీ ఎంతో కొంత ఆదాయం వస్తుందన్న ఉద్దేశ్యంతో నడుపుతున్న తరుణంలో మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బపడు తోందని మెట్రో యాజమాన్యం చెబుతోంది. నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం, ప్రతి ఐదుగురిలో ఒకరికి కోవిడ్ సోకతుండటంతో ప్రజలు చాలా వరకు ప్రయాణాలను తగ్గించుకున్నారు. దీంతో మెట్రోలో వెళ్ళేవారు
సైతం స్వంతవాహనాలను వాడుతున్నారు. సాధారణంగా వేసవిలో స్వంత వాహనాలలో వెళ్ళే వారు కూడా మెట్రోను వాడుతు ంటారు, కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో మెట్రో దరిదాపుల్లోకి కూడా రావడం లేదని అంటు న్నారు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ ట్రిప్పులను ఏ మాత్రం తగ్గించకుండా యధావిధిగా నడుపుతున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు రైళ్ళను శానిటైజ్చే స్తూ, ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు చొప్పున నడుపుతున్నామని పేర్కొంటున్నారు. అయినప్పటికీ
ప్రయాణికుల ఆధబాణ రోజురోజుకూ తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి ఉంటే ప్రస్తుతం నడుస్తున్న ట్రిప్పులను కుదించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement