Monday, June 17, 2024

ఆస్పత్రిలో మంటలు.. నలుగురు రోగులు మృతి

మహారాష్ట్రలోని ఆస్పత్రుల్లో వరుసగా అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. థానేలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు ప్రైమ్‌ క్రిటికేర్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు రోగులు మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌, ఇతర బాధితులను మరో ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్​ వల్లే ప్రమాదం జరగవచ్చని అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో ఆస్పత్రిలో మొత్తం 20 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జితేంద్ర ఆహ్వాడ్ తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేయిస్తామని చెప్పారు.

కాగా, రెండ్రోజుల క్రితం కూడా థానేలోని వేదాంత్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత కారణంగా ఐదుగురు కొవిడ్‌ బాధితులు మరణించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement