Saturday, June 1, 2024

Janhvi Kapoor: స్టైల్ మార్చిన జాన్వీ క‌పూర్

జాన్వీ క‌వ్వించే ఆ స్మైల్ కి ప‌డిపోయామంటూ ఫిదా అయిపోతున్నారు నెటిజ‌నం. సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారిన జాన్వీ క‌పూర్ ఈ స్పెష‌ల్ లుక్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. అంద‌మైన చిరునవ్వు.. ట్రెడిష‌న‌ల్ పంజాబీ డ్రెస్ లో బుట్ట‌బొమ్మ‌ను త‌ల‌పిస్తోంది. ఇటీవ‌లి కాలంలో బాపు బొమ్మ ఎవ‌ర‌మ్మా? అని వెత‌కాల్సిన ప‌రిస్థితి ఉంది.

- Advertisement -

అలాంటి వారికి ఇదిగో ఇక్క‌డ స‌రైన జ‌వాబు దొరుకుతుంద‌ని జాన్వీని చూపించ‌గ‌లం ఇప్పుడు. చిట్టి పొట్టి నిక్క‌ర్లు, బికినీలు స్విమ్ సూట్ల‌లో మ‌తులు చెడ‌గొట్టే జాన్వీయేనా? ఇంత ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తోంది! అంటూ చాలా మంది కుర్రాళ్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

అంతేకాదు ఇక‌పైనా ఈ ముగ్ధ మ‌నోహ‌రి ఇలానే కొన‌సాగాల‌ని కూడా చాలా మంది అభిమానులు ఆశిస్తున్నారు. అందంతోనే కాదు అంద‌మైన చిరున‌వ్వుతోను మ‌తులు చెడగొట్ట‌డం జాన్వీకే చెల్లింద‌ని కితాబిచ్చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement