Saturday, April 27, 2024

ఫిబ్రవరి 15 నాటికి కరోనా తగ్గుముఖం.. ప్రభుత్వ వర్గాల అంచనాలు..

థర్డ్‌వేవ్‌ తీవ్రత త్వరలోనే తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొద్ది రోజులుగా కొత్త కేసులు 3 లక్షలకుపైనే నమోదవుతున్నాయి. ఇప్పటికే చాలా నగరాల్లో వైరస్‌ గరిష్ట స్థాయిని తాకింది. మరో మూడువారాల్లో దేశమంతటా తీవ్రత తగ్గుతుంది. వ్యాక్సిన్ల కారణంగా థర్డ్‌వేవ్‌ ఉధృతికి కళ్లెం పడింది. ఫిబ్రవరి 15 నాటికి దాదాపు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం వుంది అని తెలిపాయి. ‘ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలు, మెట్రో నగరాల్లో కేసులు తగ్గడం, స్థిరంగా ఉండటం ప్రారంభమైంది’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కొత్త కేసులది అదే జోరు..
రోజువారి కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నా, సగటు కేసులు మాత్రం 3 లక్షలకు పైనే ఉంటున్నాయి. ఆదివారం ఒక్కరోజే 3.06 లక్షల కేసులు నమోదయ్యాయి. మరో 439మంది మరణించారు. పాజిటివిటీ రేటు 20.75 శాతానికి చేరింది. రికవరీ రేటు 93 శాతం వద్ద కొనసాగుతున్నది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 74 శాతం మంది వయోజనులు రెండు డోసుల టీకా తీసుకున్నారు. టీనేజర్లకు టీకాలు చురుగ్గా పంపిణీ అవుతున్నాయి. ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, వైద్య సిబ్బందికి ప్రికాషనరీ డోసు ఇవ్వడం వంటి చర్యలు థర్డ్‌ వేవ్‌ తీవ్రతను తగ్గించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జనవరి ప్రారంభంలో కొత్త కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తాజాగా వేవ్‌కు ప్రధాన కార ణం. దేశంలో ఈ వేరియంట్‌ సమూహ వ్యాప్తి స్థాయికి చేరిందని, రానున్న వారాల్లో కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించా రు. అలాగే ప్రధాన నగరాల్లో కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఆసుపత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement