Tuesday, April 30, 2024

పురావస్తు శాఖ పరిధిలోని కట్టడాలు వెలిగిపోవాలి.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో కలిసి సమీక్ష

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్న చారిత్రక కట్టడాలు, భవంతుల వద్ద జరగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమీక్షించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో కలిసి దేశవ్యాప్తంగా ఉన్న పలు స్మారక కట్టడాల వద్ద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఇండియన్ ఆయిల్ ఫౌండేషన్ (IOF) నిధులు, నేషనల్ కల్చర్ ఫండ్ (NCF) ద్వారా సంయుక్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆరా తీశారు.

దేశంలోని వివిధ ఏఎస్ఐ మాన్యుమెంట్స్ వద్ద సౌండ్ అండ్ లైటింగ్, ఇల్యుమినేషన్ మొదలైన పనుల ప్రగతిపై ఆయా ప్రాంతాల్లోని ఏఎస్ఐ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ నుంచి గోల్కొండ, చార్మినార్, వరంగల్ కోటకు సంబంధించిన పనులపైనా కేంద్రమంత్రులు సమీక్షించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఇద్దరు కేంద్ర మంత్రులు అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement