Sunday, April 28, 2024

Kejriwal: అదంతా వ‌ట్టిదే.. కొట్టిపారేసిన ఈడీ

ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ఈడీ విచార‌ణ‌కు మూడుసార్లు హాజ‌రుక‌క‌పోవ‌డంతో ప‌లు ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. కాగా దీనిపై ఈడీ స్పందించింది.


ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌నుఅరెస్టు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ కొట్టిపారేసింది. అవన్నీ వట్టి వదంతులేనని ఈడీ వర్గాలు స్పష్టం చేశాయి. కేజ్రీవాల్‌ ఇంటిపై దాడులు చేయాలని, సోదాలు నిర్వహించాలన్న ప్లాన్‌ ఏమీ లేదని వెల్లడించాయి. గురువారం ఉదయం కేజ్రీవాల్‌ ఇంటిపై ఈడీ దాడులు చేయనుందని, అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంటారని మంత్రులు అతిశి, సౌరభ్‌ భరద్వాజ్‌తోపాటు ఆప్‌ నేతలు ఎక్స్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్టు పై వ‌స్తున్న వార్త‌ల‌న్ని వట్టిదేనని ఈడీ వర్గాలు వెళ్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement