Sunday, April 28, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తలపతి విజయ్.. రెండు గంటల్లోనే 1.1 మిలియన్ ఫాలోవర్లు

తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ అధికారికంగా ఇన్స్టాగ్రామ్లో చేరారు. సినిమాలకి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఫోటోలు, ట్రైలర్‌లను షేర్ చేయడానికి విజయ్ అప్పుడప్పుడు ట్విట్టర్‌ని ఉపయోగిస్తాడు. కాగా, ఇతర సెలబ్రిటీలలాగానే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌ ఉండరు. అయితే, ఇవ్వాల (ఆదివారం) సూపర్ స్టార్ తలపతి చివరకి ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టాడు.

“హలో నాన్‌బాస్ అండ్ నాన్‌బిస్” అనే కాప్షన్ తో మొదటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ని షేర్ చేశాడు. హ్యాండిల్‌కి వెరిఫికేషన్ బ్యాడ్జ్ కూడా వచ్చేసింది. అయితే ఈ ఎకౌంట్ అతని ఆఫిస్ మ్యానేజ్ చేయనున్నట్టు బయోలో పేర్కొన్నాడు. అయితే, అతనికి ట్విట్టర్ లో 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కానీ, ఇన్‌స్టాగ్రామ్ లో అడుగు పెట్టిన 2 గంటల్లోనే 1.1 మిలియన్ ఫాలోవర్లతో దూసుకుపోతున్నాడు.

- Advertisement -

తలపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ‘లియో’ మూవీలో నటిస్తున్నాడు. అతను షేర్ చేసిన ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలో కూడా అతను ‘లియో’ వేషంలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ రెండింటిలోనూ, అతను తన హ్యాండిల్ పేరుగా ‘యాక్టర్ విజయ్’ అనే పేరును ఉపయోగిస్తాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement