Wednesday, May 15, 2024

Thailand Masters | భార‌త్ శుభారంభం.. రెండో రౌండ్‌కు భారత ప్లేయర్లు !

థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. ఇవ్వాల (బుధవారం) జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్, మిథున్ మంజునాథ్, శంకర్ ముత్తుసామిలు తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.

కిదాంబి శ్రీకాంత్ 22–20, 21–19తో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ త్జు వీపై వరుస గేముల్లో గెలుపొందగా, మిథున్ మంజునాథ్ తన తొలి రౌండ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన జాసన్ గుణవాన్‌పై 21-17, 21-8తో విజయం సాధించాడు. రెండో రౌండ్‌లో మిథున్‌ మంజునాథ్‌, శ్రీకాంత్ లు ఒక‌రినొక‌రు ఎదుర్కోనున్నారు. శంకర్ ముత్తుసామి సుబ్రమణియన్ కూడా వరుస గేమ్‌లలో మలేషియాకు చెందిన లియోంగ్ జున్ హావోపై 21-14, 21-17 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో అతను తైవాన్‌కు చెందిన లిన్ చున్-యితో తలపడనున్నాడు.

అయితే, సమీర్ వర్మ హాంకాంగ్‌కు చెందిన అంగస్ లాంగ్ చేతిలో 14-21, 18-21 తేడాతో ఓడిపోయి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా.. ఇండోనేషియా మాస్టర్స్‌లో భారత్‌ను క్వార్టర్‌ఫైనల్‌కు చేర్చిన కిరణ్ జార్జ్.. చైనా ఆటగాడు లీ లాన్ జీతో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా రిటైరయ్యాడు.

- Advertisement -

మహిళల సింగిల్స్ విభాగంలో మాళవిక బన్సోద్, అష్మితా చలిహా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తమ తొలి రౌండ్ మ్యాచ్‌లో అశ్మిత 21-10,21-16తో వాంగ్ లింగ్ చింగ్‌పై గెలుపొందగా, మాలివిక 22-20,21-8తో పెరూకు చెందిన ఇనెస్ లూసియా కాస్టిల్లో సలాజర్‌ను ఓడించింది. ఇదిలా ఉంటే, అశ్విత తదుపరి రౌండ్‌లో తైవాన్‌కు చెందిన పై యు-పోతో ఆడనుంది, మాళవిక థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌తో తలపడుతుంది.

ఇక, నిన్న (మంగళవారం) జ‌రిగిన మహిళల డబుల్స్ ఈవెంట్‌లో 16-21, 21-10, 21-18తో హాంకాంగ్ ద్వయం లోక్ లోక్ లూయి-వింగ్ యుంగ్ ఎన్‌జిపై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది భారత జంట ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్. జాలీ-గోపీచంద్ లు త‌మ‌ తదుపరి రౌండ్‌లో స్వదేశీయులైన తనీషా -అశ్విని పొన్నప్పతో త‌ల‌ప‌డ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement