Thursday, May 2, 2024

Terrorist – పాకిస్తాన్ పై ఇరాన్ స‌ర్జిక‌ల్ స్ట్రైక్ ..

ఇరాక్, సిరియాల్లో మకాం వేసిన రివాల్యూషనరీ గార్డ్స్ శిబిరాలపై రెండు రోజుల కిందటే వైమానిక దాడులను చేపట్టింది ఇరాన్. ఇప్పుడు తాజాగా తన దిశను మార్చింది. పాకిస్తాన్‌పై అస్త్రాలను ఎక్కుపెట్టింది. పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది. దీన్ని సర్జికల్ స్ట్రైక్స్‌గా పేర్కొంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. పాకిస్తాన్ భూభాగంపై గల బలూచిస్తాన్ ప్రాంతంలోని సిస్టాన్‌పై ప్రధానంగా ఇరాన్ దాడులు సాగాయి. ఆఫ్ఘనిస్తాన్- ఇరాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుందీ టౌన్. జైష్ అల్ అదిల్ ఉగ్రవాద సంస్థకు కేంద్రబిందువుగా చెబుతుంటారు. సున్ని మిలిటెంట్ల ఆధీనంలో ఈ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను సాగిస్తోంది.

2012లో ఇది ఏర్పాటైంది. ఇరాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలుు, ఆ దేశ సైన్యంపై తరచూ దాడులకు పాల్పడుతుంటుందనే పేరుంది జైష్ అల్ అదిల్ సంస్థకు. గత ఏడాది డిసెంబర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 11 మంది పోలీసులు మరణించారు. ఈ దాడులకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని అప్పట్లో ఇరాన్ హెచ్చరించింది కూడా. దీనికి అనుగుణంగా ఈ ఉగ్రవాద సంస్థ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైన్యం వైమానిక దాడులు చేపట్టింది. డ్రోన్లతో బాంబుల వర్షాన్ని కురిపించింది. మిస్సైళ్లను సంధించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనతో సిస్టాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇరాన్ పై పాకిస్తాన్ ఫైర్

ఈ దాడుల పట్ల పాకిస్తాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమ భూభాగంపై దాడులకు పాల్పడటం సరికాదంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సిస్టాన్ ప్రాంతం తమ భూభాగంపై లేదని పేర్కొంది. ఈ విషయంపై ఇప్పటికే ఇరాన్‌కు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement