Thursday, May 2, 2024

CM Revanth: అదానీ ఛైర్మన్‌ గౌతం అదానీ, టాటా ఛైర్మ‌న్ చంద్రశేఖరన్ ల‌తో రేవంత్ భేటి…

హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం.. బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతం అదానీ, టాటాసన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్ ల‌తో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ‌లో పెట్టుబ‌డి అవ‌కాశాల‌ను వారికి వివ‌రించారు..

ఇప్ప‌టికే అదానీ, టాటా సంస్థ‌లు హైద‌రాబాద్ లో విస్తృతంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నాయ‌ని రేవంత్ వారికి గుర్తు చేశారు.. వాటికి అనుబంధంగా మ‌రిన్ని సంస్థ‌ల‌ను త‌మ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయాల‌ని వారిని కోరారు.. అందుకు వారి నుంచి సానుకూల స్పంద‌న వ‌చ్చిన‌ట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ వెల్ల‌డించారు.. కాగా నేడు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌, గ్లోబల్‌ హెల్త్‌ స్ట్రాటజీ వైస్‌ ప్రెసిడెంట్‌ విలియం వార్‌, వీఆర్‌ఎల్‌డీసీ ప్రతినిధులను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. ఐటి రంగంలో హైద‌రాబాద్ అగ్ర‌గామిగా దూసుకుపోతున్న విష‌యాన్ని రేవంత్ ఈ ప్ర‌తినిధుల‌కు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ చేసి చూపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement