Saturday, December 7, 2024

టర్కీ పార్లమెంట్‌ వద్ద ఉగ్రదాడి.. ఇద్దరు పోలీసులకు గాయాలు

స్థానికంగా గల టర్కీ పార్లమెంట్‌ వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారని హోమ్‌ మంత్రి అలి యర్లికాయ ఆదివారం తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ఇద్దరు ఉగ్రవాదులు ఒక వాహనంలో పార్లమెంట్‌ వద్దకు చేరుకున్నారు. వారిలో ఒక బాంబర్‌ ఒకానొక మంత్రిత్వ శాఖ వద్ద తనను తాను పేల్చుకోగా, మరొక బాంబర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బాంబర్లకు మధ్య కాల్పులు జరిగాయి. పార్లమెంట్‌ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభమవుతాయనగా ఉగ్రదాడి జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement