Thursday, April 25, 2024

జూన్‌ 2నుంచి టెన్త్ పేప‌ర్ వ్యాల్యూయేష‌న్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 23 నుంచి జూన్‌ 1 వరకు పదో తరగతి పరీ క్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ప్రశ్నపత్రాల మూల్యాం కనానికి సంబంధించిన షెడ్యూల్‌ను డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్జామినేషన్‌ ఏ.క్రిష్ణారావు సోమవారం జారీ చేశారు. జూన్‌ 2 నుంచి 11 వరకు పదో తరగతి పరీక్ష పేపర్ల మూ ల్యాంకనం చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే ఈనెల 25న మూల్యాంకనంలో పాల్గొనే అధికారులు రిపోర్టింగ్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కొత్త జిల్లాలు ఏర్పడి ఆరేళ్లవుతున్నా ఇప్పటికీ పాత ఉమ్మడి జిల్లాల్లోనే స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ (మూల్యాంకనం) కేంద్రాలు ఏర్పాటు చేయడాన్ని పలువురు ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement