Sunday, May 5, 2024

త్వరలో 10 ప్రాజెక్టులకు టెండర్లు.. ఎన్‌హెచ్‌ల కేటాయింపులో తెలంగాణకు సింహభాగమే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణంపై కేంద్ర ఉపరితల రోడ్డు, రవాణా శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. తెలంగాణ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం ఉండటం, హైదరాబాద్‌ ప్రపంచ నగరాల సరసన చేరడంతో తెలంగాణలోనూ జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు భారీగానే ఇస్తోంది. ఇందులో భాగంగానే త్వరలో పది ప్రాజెక్టు లకు టెండర్లను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు టెండర్లు ఖరారు చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా రూ.28, 615 కోట్ల వ్యయంతో 715 కి.మీ. మేర ఉండే 10 వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు ఖరారు చేయను న్నట్లు తెలిసింది. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కసరత్తులు చేపడుతున్నారు. ఈ పది ప్రాజెక్టుల్లో ప్రధానంగా నాగ్‌పూర్‌-విజయవాడ 163 హైవేను 311 కి.మీ.మేరకు 3 ప్యాకేజీలుగా రూ.8994 కోట్లతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండేళ్ల క్రితమే భూసేకరణ పూర్తయింది. కొంత వరకు రోడ్డు నిర్మాణం కూడా కొనసాగుతోంది. రీజినల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) సంగారెడ్డి- నర్సాపూర్‌-తూఫ్రాన్‌-చౌటుప్పల్‌(ఉత్తర భాగం)ను 158 కి.మీ.ను రూ.11590 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈప్రాజెక్టు భూసేకరణకు కేంద్రం రెండు గెజిట్‌లను ఇప్పటికే విడుదల చేసింది. వీటితోపాటు ఈఏడాది చేపట్టనున్న ఏడు ప్రాజెక్టులలో తొండపల్లి-కొత్తూరు 12కి.మీ., కాలకల్లు-గుండ్లపోచంపల్లి 17 కి.మీ. ప్రాజెక్టులను గత నెల 29 కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శంషాబాద్‌లో శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్‌-వరంగల్‌ హైవేలకు టెండర్లను ఇప్పటికే ఆహ్వానించారు. మిగిలిన మరో 6 ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తయినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు, నాగపూర్‌-విజయవాడ ప్రాజెక్టులో భాగంగా మంచిర్యాల నుంచి వరంగల్‌, ఖమ్మం మీదుగా విజ యవాడ వరకు ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలవను న్నారు. పది ప్రాజెక్టుల్లో ఏడు ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తిఅయ్యింది.

10 ప్రాజెక్టులు ఇవే…

రూ.2146.86 కోట్లతో 68 కి.మీ. కరీంనగర్‌-వరంగల్‌ ఎన్‌హెచ్‌ 563 రహదారి. రూ.541,60 కోట్లతో 12 కి.మీ. తొండపల్లి-కొత్తూరు ఎన్‌హెచ్‌44. రూ.955.50 కోట్లతో 17 కి.మీ.కాల కల్లు-గుండ్లపోచంపల్లి ఎన్‌హెచ్‌44. రూ.1900 కోట్లతో 59 కి.మీ. జగిత్యాల-కరీంనగర్‌ ఎన్‌హెచ్‌ 563. రూ.1375 కోట్లతో 44కి.మీ డియోసుగుఉ-జడ్చర్ల ప్యాకేజ్‌1 ఎన్‌హెచ్‌ 167. మరికల్‌-జడ్చర్ల ప్యాకేజ్‌2 46కి.మీ. రూ.1112 కోట్లు ఎన్‌హెచ్‌ 167. రూ.2795 కోట్లతో మంచిర్యాల-వరంగల్‌ 112 కి.మీ. ఎన్‌హెచ్‌163జి. రూ.3111 కోట్లతో ఖమ్మం-ఏపీ బార్డర్‌ 90 కి.మీ. ఎన్‌హెచ్‌ 163జి. రూ.11590 కోట్లతో ఆర్‌ఆర్‌ఆర్‌ 158 కి.మీ ఎన్‌హెచ్‌ 161ఏ.

పెరగనున్న వాణిజ్యం…

రాష్ట్రంలో హైవేల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే వాణిజ్యం పెరగనుంది. జాతీయ రహదారులకు అనుసంధానంగా లాజిస్టిక్‌ పార్కులను నిర్మిస్తే అభివృద్ధి ఊపందు కుంటుంది. హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, మంచిర్యాల తదితర జాతీయ రహ దారులకు ఆనుకుని పట్టణాలు ఉండడంతో జాతీయ రహదా రులను అభివృద్ధి చేస్తే వాణిజ్యం పెరగ నుండడంతో ఈక్రమం లోనే జాతీయ రహదారు లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారిస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేనంతగా గత ఏడేళ్లలో దేశంలో 4252 కి.మీ. జాతీయ రహదారులను కేంద్రం నిర్మించింది. ఈక్రమంలోనే జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.28,614 కోట్ల నిధులతో పనులు చేపడుతున్నది. ఇంతేకాకుండా దీర్ఘకాళిక లక్ష్యాలను కూడా కేంద్రం పెట్టుకొని ముందుకుపోతున్నది. ఇందులో భాగంగానే వచ్చే 5ఏళ్ల(2026-27)వరకు 4252 కి.మీ. నుంచి 5600 కి.మీ.లకు పెంచాలని భావిస్తోంది. అలాగే దేశ వ్యాప్తంగా 22 ఎక్స్‌ప్రెస్‌ హైవేలను సైతం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement