Sunday, April 28, 2024

సోనూసూద్ ను చూసి తెలుగు హీరోలు కళ్లు తెరవాలి…భట్టి విక్రమార్క

కరోనా కష్ట సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ నటుడు సోను సూద్. లాక్ డౌన్ సమయంలో స్వగ్రామాలకు ఎంతో మంది పేద ప్రజలకు తరలించి వారి మన మనసులు గెలుచుకున్నాడు. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేసి వారి అందరి అభిమానాన్ని పొందాడు.

ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా ఎంతో మందికి ఇంజెక్షన్లను ,బెడ్స్ ను ఏర్పాటు చేస్తున్నాడు. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సోనూసూద్ పై ప్రశంసల జల్లు కురిపించారు. సోనూసూద్ ను చూసి తెలుగు హీరోలు హీరోయిన్లు కళ్లు తెరవాలని భట్టి విక్రమార్క అన్నారు. కరోనా బాధితులకు టాలీవుడ్ హీరోలు హీరోయిన్ ముందుకు వచ్చి సహాయం చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement