Tuesday, May 7, 2024

ఇన్నోవేషన్ ఇండెక్స్ లో తెలంగాణ టాప్.. దేశంలో రెండో ర్యాంక్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మరో ప్రతిష్టాత్మక ర్యాంకింగ్‌లో తెలంగాణ సుస్థిర స్థానంతో దూసుకుపోయింది. గురువారం నీతి ఆయోగ్‌ ప్రకటించిన ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ – 2021లో తెలంగాణ తన సత్తాను చాటుకుంది. నూతన ఆవిష్కరణల్లో భాగంగా నీతి ఆయోగ్‌ ప్రకటించిన ఈ జాబితాలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ రెండోస్థానం దక్కించుకుంది. మొదటి స్థానంలో కర్నాటక నిలువగా మూడోస్థానాన్ని హరియాణా దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్యంలోని నీతి ఆయోగ్‌ గురువారం ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ మూడో ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ నివేదికలో పెద్ద రాష్ట్రాల కేటగిరిలో కర్నాటక మొదటి స్థానంలో నిలువగా తెలంగాణ రెండోస్థానాన్ని సాధించింది. ఈశాన్య, కొండ ప్రాంత రాష్ట్రాల్లో మణిపూర్‌, కేంద్ర పాలిత ప్రాంతాలు, సిటీ స్టేట్స్‌ విభాగాల్లో చండీగఢ్‌ అగ్రస్థానంలో నిలిచింది. 66 విశిష్టమైన ఇండికేటర్స్‌ ద్వారా ఈ జాబితాను నీతి ఆయోగ్‌ గుర్తించింది. గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ (జీఐఐ) సూత్రాలకు అనుగుణంగా జాతీయ స్థాయి ఆవిష్కరణల సూచీలను రూపొందించి అన్ని రాష్ట్రాల ర్యాంకులను పరిశీలించారు. ఈ సూచిల్లో వరుసగా మూడోసారి కర్నాటక టాప్‌ ప్లేస్‌ను కొట్టేసింది. దేశంలో నవకల్పనలు, నూతన ఆవిష్కరణలలో వివిధ రాష్ట్రాల పని తీరుకు అద్దం పట్టేలా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ను నీతి ఆయోగ్‌, ఇన్‌స్ట్ట్యూ ఫర్‌ కాంపిటేటివ్‌నెస్‌లు కలిసి సంయుక్తంగా ప్రతియేటా ఈ నివేదికను విడుదల చేస్తున్నాయి. ఈ మేరకు గురువారం మూడో ఎడిషన్‌ను నీతి ఆయోగ్‌ సభ్యులు వీకే సారస్వత్‌, సీఈవో పరమేశ్వరన్‌, సీనియర్‌ సలహాదారు నీరా సిన్హా, సంస్థ వైఎస్‌ చైర్మన్‌ సుమన్‌ బేరీలో ఈ నివేదికను విడుదల చేశారు.

వివిధ సూచీలను బట్టి కేంద్రం ప్రతియేటా దేశంలోని కొత్త ఆవిష్కరణలకు ఉన్న అనుకూలతలు, సవాళ్లను తెలుసుకునేందుకు అవకాశం కలుగుతోంది. ఫలితంగా జాతీయ స్థాయిలో సమగ్ర విధాన రూపకల్పనలకు అవకాశం ఏర్పడుతున్నది. ఎఫ్‌డీఐలను అత్యధికంగా ఆకర్షిస్తున్న రాష్ట్రాల జాబితాల్లో కూడా కర్నాటక తొట్టతొలి స్థానంలో నిలిచింది. దేశంలోకి ఎఫ్‌ఐడీల ద్వారా వస్తున్న పెట్టుబడుల్లో 38 శాతం కర్నాటకకు తరలిపోతున్నాయి. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర 26 శాతం, ఢిల్లిd 14 శాతంగా నమోదయ్యాయి. అయితే దేశవ్యాప్తంగా పట్టణీకరణ మందగమనంలో సాగుతున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఢిల్లిd 2.5 కోట్లు, ముంబై 2.1 కోట్లు, కోల్‌కతా 1.5 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల జాబితాలో ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. దేశ జీడీపీలో నగర జనాభా 63 శాతంగా ఉందని ఈ నివేదిక వెల్లడించింది.

రాష్ట్రం 2021 ర్యాంకు

కర్నాటక 18.01 1
తెలంగాణ 17.66 2
హరియాణా 16.35 3
మహారాష్ట్ర 16.06 4
తమిళనాడు 15.69 5
పంజాబ్‌ 15.35 6
ఉత్తరప్రదేశ్‌ 14.22 7
కేరళ 13.67 8
ఆంధ్రప్రదేశ్‌ 13.32 9
జార్ఖండ్‌ 13.10 10
పశ్చిమ బంగాల్‌ 12.98 11
రాజస్థాన్‌ 12.88 12
మధ్రప్రదేశ్‌ 12.74 13
గుజరాత్‌ 12.41 14
బీహార్‌ 11.58 15
ఒడిషా 11.42 16
చత్తీస్‌గఢ్‌ 10.97 17

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement