Thursday, May 16, 2024

తెలంగాణలో అదనపు కలెక్టర్ల బదిలీ

తెలంగానలో పలువురు అదనపు కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. కరీంనగర్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నరసింహారెడ్డిని మేడ్చల్‌ మల్కాజిగిరికి బదిలీ చేసింది. మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌గా ఉన్న కే విద్యాసాగర్‌ను బదిలీ చేసింది. ఆయనను రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. జీ. రమేశ్‌ను మెదక్‌, మోహన్‌ రావును సూర్యాపేట అదనపు కలెక్టర్లుగా నియమించింది.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌ పీ.రాంబాబును నిర్మల్‌కు బదిలీ చేసింది. జగిత్యాల అదనపు కలెక్టర్‌ రాజేశంను కుమ్రం భీంకు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. మహబూబాబాద్‌ అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లును హైదరాబాద్‌కు, జోగులాంబ గద్వాల అడిషనల్‌ కలెక్టర్‌ పీ. శ్రీనివాస్‌రెడ్డి నాగర్‌ కర్నూల్‌కు బదిలీ చేసింది. వరంగల్ రూరల్‌ అదనపు కలెక్టర్‌గా బీ.హరిసింగ్‌ను నియమించింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న రఘురాం శర్మను జోగులాంబ గద్వాల జిల్లాకు, నాగర్‌కర్నూల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా ఉన్న మధుసూదన్‌ నాయక్‌ను మంచిర్యాలకు, ఆదిలాబాద్‌ అదనపు కలెక్టర్‌ సంధ్యారాణిని వరంగల్‌ అర్బన్‌కు బదిలీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement