Saturday, May 4, 2024

తెలంగాణలో తగ్గని కరోనా..

తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 409 కొత్తక కేసులు వెలుగుచూశాయి. 88,308 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,54,035కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,852కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 453 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,43,318కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,865 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: టీడీపీలో గోరంట్ల సంక్షోభం.. నేతల పరుగో పరుగు..

Advertisement

తాజా వార్తలు

Advertisement