Thursday, May 2, 2024

తెలంగాణ లో కొత్తగా 245 కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 50,126 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 245 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,52,380కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,842కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 582 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,41,270కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,268 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement