Wednesday, May 15, 2024

ప్రతి గ్రామానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌ సదుపాయం.. హై స్పీడ్‌ నెట్‌తో 4జీ, వచ్చే సంవత్సరం నాటికి పూరి

వచ్చే సంవత్సరం కల్లా దేశంలోని ప్రతి గ్రామానికి హై స్పీడ్‌ బ్రాడ్‌బాండ్‌ కనెక్షన్స్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ టెలికం సంస్థ బీఎన్‌ఎన్‌ఎల్‌ ప్రతి గ్రామానికి 4జీ సర్వీస్‌లను అందించడంతో పాటు, బ్రాడ్‌బాండ్‌ నెట్‌ కనెక్షన్లను ఇస్తామని టెలికం శాఖ కార్యదర్శి కే. రాజారామన్‌ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ మౌలికసదుపాయలు కల్పించేందుకు వీలుగా కాంట్రాక్ట్‌లు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ కాం ట్రాక్ట్‌లన్నీ చివరి దశలో ఉన్నాయని చెప్పారు. 2040 నాటికి వంద శాతం డిజిటల్‌ చెల్లింపులు జరపాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలోనూ హై స్పీడ్‌ బ్రాడ్‌బాండ్‌ సర్వీస్‌లను అందిస్తామన్నారు.

2017లో చైనా జనాభాలో 50 శాతం మంది మాత్రమే మన దేశంలో డిజిటల్‌ చెల్లింపులు చేశారని, ప్రస్తుతం ఇది చైనా జనాభా కంటే రెట్టింపు అయ్యిందని టెలికం శాఖ సహాయ మంత్రి చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వచ్చే సంవత్సరంలో అన్ని గ్రామాల్లో 4జీ సర్వీస్‌లను ప్రారంభించడంతో పాటు, అన్ని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను కూడా ప్రారంభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అవసరమైన మౌలికసదుపాయాలను, సాంకేతికతను సమకూర్చుకుంటున్నట్లు రాజారామన్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement