Friday, May 3, 2024

Breaking: అథ్లెటిక్స్​లో తెలంగాణ సత్తా.. 100 మీటర్ల పరుగుపందెంలో చాంప్​గా గురుకుల స్టూడెంట్ నందిని​

కొలంబియాలో జరుగుతున్న అండర్-20 జూనియర్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్ కు తెలంగాణ అమ్మాయి అర్హత సాధించింది. సోషల్​ వెల్ఫేర్​ గురుకుల స్టూడెంట్​ అయిన నందిని 13.58 సెకన్ల రికార్డును 13.34 సెకన్లలో అధిగమించి చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. అయితే.. ఈమె ఈ యువతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిందని, నందిని తండ్రి టీ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తాడన్న విషయం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది.

ఆమె విజయం సాధించినందుకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS) సెక్రటరీ రోనాల్డ్ రోస్ అభినందించారు. నందిని కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ విషయాన్ని షేర్​ చేసుకున్నారు. ఒక టీ అమ్మేవారి కుమార్తె అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి తీవ్రమైన ఆర్థిక పరిమితులను అధిగమించిందని కొనియాడారు. ఆమె జీవితం తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది అణగారిన బాలికలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తందని సీనియర్​ ఐఏఎస్​ ఆఫీసర్​ రొనాల్డ్​ రోస్​ అన్నారు.

కాగా, వివిధ క్రీడా విభాగాల్లో 28 మంది క్రీడా విద్యావేత్తలను నియమించి వారికి మంచి ట్రైనింగ్​ ఇచ్చేందుకు కృషిచేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్​కు ఈ సందర్భంగా రొనాల్డ్​ రోస్​ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ ఖ్యాతి గడించిన అత్యుత్తమ కోచ్‌ల ద్వారా క్రీడా ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇక.. నందిని విజయం సాధించినందుకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement