Saturday, May 18, 2024

తాప్సీ సిక్స్ ప్యాక్ – షాక్ లో ఫ్యాన్స్

చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. ఈ విషయంలో తాప్సీ రెండడుగులు ముందుకేసింది. హీరోలు, విలన్లు సిక్స్ ప్యాక్ చెయ్యడం సర్వసాధారం అయిపొయింది, ఫర్ ఏ చేంజ్ ఈసారి నేను చెయ్యాలి అనుకుందో ఏమో కానీ తాప్సీ పన్ను సిక్స్ ప్యాక్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లో తన అందంతో, ఆ తర్వాత తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ ని తన ఫాన్స్ గా మార్చుకున్న తాప్సీ, బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ మార్కెట్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డుంకీ’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న తాప్సీ పన్ను, ‘నామ్ షబానా’ సీక్వెల్ చెయ్యడానికి కూడా రెడీ అయ్యింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కోసం రెడీ అయ్యిందా లేక క్యాజువల్ గా ఫిట్ అయ్యిందో తెలియదు కానీ తాప్సీ మాత్రం సిక్స్ ప్యాక్ చేసేసింది. తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో జిమ్ ట్రైనర్ ‘సుజీత్ కర్గుట్కర్‌’తో కలిసి పోజులిచ్చిన రెండు ఫోటోలను పోస్ట్ చేసింది తాప్సీ. ఈ సిక్స్ ప్యాక్ ను చూసి నెటిజ‌న్ లు స్ట‌న్ అవుతున్నారు.. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement