Sunday, May 5, 2024

ప్రపంచంలోనే మోస్ట్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ గా టాప్ లో.. షారుక్ ఖాన్

ప్రపంచంలోనే మోస్ట్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ గా టాప్ లో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నిలిచాడు. అంతర్జాతీయంగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ కు ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అమెరికన్ న్యూస్ మ్యాగజైన్ Time నిర్వహించిన వరల్డ్ మోస్ట్ ఇన్ ఫ్లూయెనర్స్ వార్షిక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన పొలిటిషన్స్, సినీ స్టార్స్, వైద్య నిపుణులు, వ్యాపారవేత్తలు ఉంటారు. 2023 Time 100 రీడర్ పోల్ లో షారుఖ్ ఖాన్ విజయం సాధించారు. టైమ్ మ్యాగజైన్ పోల్ కోసం పాఠకులు పోల్ చేసిన 1.2 మిలియన్ల ఓట్లలో 4 శాతం షారూఖ్ ఖాన్ పొందారు. పోల్ లో హాలీవుడ్ నటుడు మిచెల్ యోహ్, అథ్లెట్ సెరెనా విలియమ్స్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, బ్రెజిలియన్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, లియోనెల్ మెస్సీ కూడా కనిపించారు. అత్యధిక ఓట్లతో కింగ్ ఖాన్ విజయం సాధించారు.బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా, కింగ్ ఖాన్ గా షారుఖ్ ముద్ర వేసుకున్నారు. మూడు దశాబ్దాలుగా వందకు పైగా చిత్రాల్లో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్నారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న ‘జవాన్’ Jawan చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement