ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు గురువారం నుంచి మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. టీ20 సిరీస్ ఫేవరేట్‌గా టీమిండియా బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ కరోనావైరస్ నుంచి కోలుకుని జట్టులో చేరగా, ఇటీవల ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లోఅద్భుతంగా రాణించిన బ్యాటర్లు టీమిండియా జట్టులో ఉన్నారు. తొలి టీ20 మ్యాచ్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనుండగా, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు. ఇక రెండు, మూడు టీ20 మ్యాచ్‌లకు రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్‌లను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అటు ఇంగ్లండ్ జట్టును పరిశీలిస్తే… జాస్ బట్లర్ (కెప్టెన్), డేవిడ్ మలాన్, హర్రీ బ్రూక్, జాసన్ రాయ్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, శామ్ కురన్, ఫిల్ సాల్ట్, క్రిస్ జోర్డన్, డేవిడ్ విల్లే, మట్ పార్కిన్‌సన్, రీస్ టోప్లే, రిచర్డ్ గ్లీసన్, ట్యమల్ మిల్స్ ఉన్నారు.
టీమిండియా ఆటతీరును పరిశీలిస్తే… ఇటీవల ఐర్లాండ్, సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌ల్లో అద్భుతంగా రాణించింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో టీ20 టోర్నమెంట్లలో భారత జట్టు వరుస విజయాలు నమోదు చేసుకుంటోంది. అదే స్ఫూర్తితో ఇంగ్లండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌లోనూ రాణిస్తుందని కోచ్ రాహుల్ ద్రవిడ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇంగ్లండ్ జట్టులో జాస్ బట్లర్, జాసన్ రాయ్‌లు మ్యాచ్‌ను కీలక సమయాల్లో మార్చగలరని ఖ్యాతి ఉంది. టీ20 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌పై టీమిండియా గత అనుభవానాలను పరిశీలిస్తే పైచేయి సాధిస్తుందనే చెప్పవచ్చు. ఇంగ్లండ్‌తో 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 9 మ్యాచ్‌ల్లో మాత్రమే ఇంగ్లండ్ గెలుపొందింది. అయితే ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 టోర్నీ నేపథ్యంలో ఆతిథ్య జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఏదిఏమైనా టీమిండియా తన సత్తా చాటి టీ20 సిరీస్‌ను చేజిక్కించుకుంటుందని ఆశిద్దాం. గురువారం తొలి టీ20 మ్యాచ్ రోజ్ బౌల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30గ.లకు ప్రారంభం కానుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.