Sunday, April 28, 2024

Custard Apple: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. సూపర్ …

  • అనేక పోషకాల సమాహారం
  • ఔషధ గుణాల సమూహం
  • సమృద్ధిగా విటమిన్ సీ

    రుచిగా ఉండే పండ్లలో సీతాఫలం కూడా ఒకటి.. శీతాకాలం ప్రారంభం అయిందంటే ఈ పండ్లు మార్కెట్లో విరివిగా లభిస్తుంటాయి. ఏడాదికి ఒకసారైనా సీతాఫలాల రుచి చూడాలన్న కోరికతో ఉంటారు. ఇంగ్లిష్‌లో కస్టర్డ్ యాపిల్స్ గా పిలిచే సీతా ఫలం ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. సీతా ఫలం అద్భుతమైన రుచితో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా అందించడంలో కీలక పాత్ర వహిస్తాయి. సీతాఫలం అనేక పోషకాల సమాహారం. కొన్ని రకాల రోగాలకు నివారిణిగానూ పని చేస్తుంది. మరెన్నో సుగుణాలున్న ఈ పండు రామాఫలం, లక్ష్మణ ఫలం అనే రకాల్లోను లభిస్తుంది. చూడడానికి ఒకే విధంగా ఉన్న రుచి వాసనలో కాస్త తేడా ఉంటుంది. సీజనల్ వస్తుందంటే చాలు కొన్ని పండ్ల రుచి పదేపదే గుర్తొస్తుంటుంది.
    – సిద్దిపేట ప్రతినిధి
  • మధుర ఫలాల్లో సీతాఫలం ఒకటి. ప్రస్తుతం సీజన్ ప్రారంభమైంది. మార్కెట్ లో సీతాఫలాల అమ్మకాలూ సాగుతున్నాయి. ఈ సమయంలో సీతాఫలం చరిత్రను తిరగేద్దాం రండి.. ఈ ఫలానికి స్వీట్యాపిల్, షుగర్ యాపిల్, కష్టర్డ్ యాపిల్ అని, షరీఫా అని రకరకాల పేర్లున్నాయి. ఇది దక్షిణ అమెరికా దేశాలతో పాటు మన దేశంలోనూ అధికంగా పండుతుంది. దీని గుజ్జు ద్వారా స్వీట్లు, జెల్లి, ఐస్క్రీమ్, జామ్లు తయారు చేస్తుంటారు. 100 గ్రాముల సీతాఫలం గుజ్జు రోజూ తీసుకోవటం వల్ల దాదాపు 10 శాతం మెగ్నీషియం అందుతుంది. కండరాలకు విశ్రాంతి ఇవ్వటంలో, గుండెజబ్బుల బారినుంచి శరీరాన్ని కాపాడటంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది. సీతాఫలం తేలికగా జీర్ణమయ్యే పండు. అందువల్లే దీనిని అన్ని వయసుల వారూ నిర్భయంగా సేవించవచ్చు. అంతేకాక పసిపిల్లలు తీసుకునే ఆహారంలోనూ ఈ గుజ్జును చేర్చి తినిపించినా మరింత బలంగా ఉంటుంది.
    ప్రయోజనాలు
    జ్వరంగావుండి నాలుక పిడసకట్టి ఒకటే దాహంగా ఉన్నప్పుడు సీతాఫలం గుజ్జు, పాలు కలిపిన మిశ్రమాన్ని తాగితే దాహం తగ్గిపోతుంది. అయితే, గర్భిణులు ఈ పండు తినకూడదు. పుండ్లు తగ్గడానికి ఈ చెట్టు ఆకులు బాగా పనిచేస్తాయి. సీతాఫలం ఆకు పసరు రాయటంవల్ల పళ్ళచిగుళ్ళకు వచ్చేవ్యాధి తగ్గుతుంది. పిప్పన్ను నొప్పి తగ్గుతుంది. సీతాఫలం గింజల పొడిని కొబ్బరినూనెలో కలిపి తలకు రాస్తే పేలు నసిస్తాయి. చలువచేసే గుణం కలిగివుంటుంది. మాంస ధాతువులను కూడా పెంచుతుంది. మూత్రంలో మంటను తగ్గిస్తుంది. ఇన్నిళగుణాలున్న సీతాఫలాన్ని అందుబాటులో ఉన్నంతవరకు రోజూతింటే ఎంతో మేలు చేకూరుతుంది.

పోషకాలు:
100 గ్రాముల సీతాఫలంలో శక్తి : 101 క్యాలరీలు, మాంస కృత్తులు : 1.7 గ్రాములు, కొవ్వు : 0.6 గ్రాములు, కార్పోహైడ్రేట్లు : 25.2 గ్రాములు, ముడిపీసు : 3 గ్రాములు, క్యాల్షియం : 17 మిల్లీగ్రాములు, ఫాస్పరస్ : 47 మిల్లీ గ్రాములు, పొటాషియం : 382 మిల్లీ గ్రాములు లభిస్తాయి.

ఆయుర్వేద చికిత్సలో సీతాఫలం ఆకులను, బెరడు, వేర్లను ఉపయోగించి డయాబెటిస్, గుండె జబ్బులు చర్మ వ్యాధులు, డయేరియా వంటి వ్యాధులకు అద్భుత పరిష్కారం చెప్తారు. సీతాఫలం మొక్క బెరడును నీళ్లలో బాగా మరిగించి మిగిలిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకున్నట్లయితే ప్రమాదకర డయేరియా వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలంపాటు చక్కెర వ్యాధితో బాధపడేవారు కొన్ని సీతాఫల ఆకులను సేకరించి వాటిని నీళ్లలో మరిగించి కషాయాన్ని ప్రతిరోజూ పరగడుపున కొన్ని రోజులపాటు తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఈ ఆకుల్లో ఉన్న అధిక మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సీతాఫలం ఆకుల్లో యాంటీబ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కావున వీటిని ప్రతిరోజూ కషాయంగా చేసుకుని తాగితే సీజనల్ గా వచ్చే వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు మరియు ఆకులను పేస్ట్ గా చేసి గాయాలపై రాసినట్లయితే గాయాలు త్వరగా మానడంతో పాటు చర్మ సమస్యలు తొలగుతాయి. మలబద్ధకంతో బాధపడేవారు సీతాఫలాలను తుంటే జీర్ణప్రక్రియ మెరుగవుతుంది. నోటిలో జీర్ణ రసాలను ఊరేలా చేసే గుణం ఈ పండుకు ఉంటుంది. జలుబు,దగ్గు అయాసంతో బాధపడేవారు ఈ పండును పరిమితంగా తీసుకోవటం ఉత్తమం. మధుమేహ రోగులు సీతాఫలం తినకపోవటమే మేలు. ఎందుకంటే చక్కెరల శాతం చాలా ఎక్కవగా ఉంటుంది. ఖాళీ కడుపుతో సీతాఫలాలను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

సమృద్ధిగా సీ విటమిన్…
సీతాఫలం సీతాకాలంలో 3 నెలల పాటు సీజనల్ ప్రూట్గా లభ్యమవుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎదిగే పిల్లలకు ఈ పండు చాలా మంచిది. వీటిలో క్యాలిష్యం, విటమిన్ సీ సమృద్ధిగా దొరుకుతుందంటుననారు. ఆహారం తేలికగా జీర్ణమయ్యేందుకు సీతాఫలంలోని పీచు పదార్థం ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఏసీజన్ లో పండిన పండును ఆ సీజన్ లో తినడం ద్వారా మంచి ఆరోగ్య వంతమైన జీవనం సాగించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement