Wednesday, May 1, 2024

జిమ్ లో హెవీ వ‌ర్క్ వుట్స్ చేస్తోన్న.. సూర్య‌

తమిళ స్టార్ శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు స్టార్ హీరో సూర్య‌. కాగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమా కోసం సూర్య జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తున్నారు. గతంలో ‘సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్’,‘7th సెన్స్’ చిత్రాల్లో సిక్స్ ప్యాక్ చూపించారు. మళ్లీ ఈ సినిమాతో ఉక్కులాంటి శరీరాన్ని ప్రదర్శించేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా ‘సూర్య42’ చిత్రాన్ని రూపొందిస్తున్న స్టూడియో గ్రీన్ సంస్థ ఓ వీడియోను అభిమానుల కోసం విడుదల చేశారు. జిమ్ లో సూర్య పుల్ అప్స్ చేస్తూ మరింత ఫిట్ గా తయారవుతున్నారు. 3డిలో చారిత్రక చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం చాలా ఫిట్ గా కనిపించేందుకు ఇలా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సినిమా కోసం సూర్య హార్డ్ వర్క్, డెడికేషన్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ చిత్రం Suriya 42 వర్క్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. చిత్రంలో బాలీవుడ్ నటి దిశా పటాని హీరోయిన్ గా కనిపించబోతున్నారు. యోగి బాబు, కింగ్స్లీ, కోవై సరళ, ఆనంద్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 10 భాషల్లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది మధ్యలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement