Sunday, May 5, 2024

Navy plane: ర‌న్‌వే నుంచి స‌ముద్రంలోకి… దూసుకెళ్లిన నిఘా విమానం

రన్‌వే ​పై నుంచి జారిన ఓ నిఘా విమానం ఏకంగా సముద్రంలోకి దూసుకెళ్లింది. హవాయిలోని మెరైన్‌ కోర్‌ బేస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నిఘా విమానం అమెరికా నౌకాదళానికి చెందినదని ఆ కోర్‌ ప్రతినిధి ఓర్లాండో ప్రెజ్‌ తెలిపారు. వెంటనే కోస్టు గార్డు సిబ్బంది అప్రమత్తమవ్వడంతో విమానంలోని సిబ్బంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.

అయితే సముద్రం వద్ద బోటింగ్ చేస్తున్న వారు ఒక్కసారిగా విమానం దూసుకురావడంతో షాకయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికా నౌకాదళంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న పీ-8ఏ పొసెడాన్‌ విమానం సబ్‌మెరైన్లను గాలించి వాటిపై దాడి చేయగలదని అధికారులు తెలిపారు. ఇది టోర్పెడోలు, క్రూజ్‌ క్షిపణులను కూడా తీసుకెళ్లగలదని వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో మాత్రం వెల్లడించలేదు. ఈ విమానాన్ని నిర్వహించే పెట్రోల్‌ స్క్వాడ్రన్‌ కనోహె బే కేంద్రంగా పనిచేస్తోంది. మెరైన్‌ కోర్‌ ప్రధాన స్థావరం కూడా హవాయిలోనే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement